నల్గొండ

ఏడీ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, డిసెంబర్ 14: చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో శిథిలమైన విద్యుత్ ఇనుప స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ఎదుట సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. చౌటుప్పల్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ ఇనుప స్తంభాలను నేటికి వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఇనుప స్తంభాలు శిథిలావస్థకు చేరుకోని ప్రమాదకరంగా మారాయన్నారు. విద్యుత్ షాక్‌తో ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయన్నారు. వర్షాకాలంలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కొత్తగా నిర్మాణమవుతున్న కాలనీలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలేదన్నారు. అధికారులు తక్షణమే స్పందించి అన్ని ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, శిథిలమైన స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి ప్రజలకు మేరుగైన విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పట్టణంలో నివాసాల మధ్య ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బూర్గు కృష్ణారెడ్డి, పట్టణ కార్యదర్శి ఎం.డి.పాషా, నాయకులు బత్తుల శ్రీశైలం, బత్తుల లక్ష్మయ్య, దండ అరుణ్‌కుమార్, గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్, గోపగోని లక్ష్మణ్, దాడి సురేందర్‌రెడ్డి, బావండ్లపల్లి స్వామి, ఉష్కాగుల రమేష్‌గౌడ్, గంజి రామచంద్రం, మొగుదాల రాములు తదితరులు పాల్గొన్నారు.
22, 23 న అమరుల స్ఫూర్తియాత్ర
నల్లగొండ రూరల్, డిసెంబర్ 14: అమరుల ఆశయ సాధనకై ఈ నెల 22, 23 తేదీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నట్లు టీజేఏసీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మార్జున్, రాష్ట్ర స్టీరింగ్ కమి టీ సభ్యుడు ఎస్.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకులు ప్రజా సమస్యలు పరిష్కరించకపోగా మరింత జఠిలం చేశారన్నారు. ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలపై, అమరుల పునాదులపై ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచి కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందన్నారు. సీఎం కేసీ ఆర్ ప్రజాస్వామిక విలువలు మరిచి అపరిమితమైన అధికారాలను పోలీసులకు అప్పజెప్పి నియంతలా పాలిస్తున్నారని వాపోయారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును కాలరాస్తున్న సందర్భంలో అమరుల ఆశయాలను సాధించేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. హైకోర్టు అనుమతిచ్చినా నాయకుల నిర్బంధం తగదన్నారు. 7వ దశ అమరుల స్ఫూర్తియాత్ర 22న చౌటుప్పల్‌లో ప్రారంభమై నల్లగొండ ఎన్జీ కళాశాలలో సభ జరుగుతుందని, 23న నల్లగొండ నుండి ప్రారంభమై సూర్యాపేటలో బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యమాల పురిటి గడ్డ అయిన జిల్లాలో ఫ్లోరోసిస్, ఫార్మా కంపెనీల కాలుష్యం, ప్రాజెక్టు నిర్మాణాల వంటి వాటికి పరిష్కారం లభించలేదని, ఈ సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వం రైతాంగం, విద్య, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందన్నారు. స్ఫూర్తి యాత్రకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు, రైతు లు హాజరుకావాలని కోరారు. జిల్లా కన్వీనర్ పన్నాల గోపాల్‌రెడ్డి, కో కన్వీనర్ పందుల సైదులు, గాజుల శ్రీను, సైదులు, అశోక్, క్రాంతి, తిరుమలేశ్, కృష్ణ, కంచె శ్రీను, సోమయ్య, అశోక్, బచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.