నల్గొండ

పల్లెల్లో పార్టీకి పట్టుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, డిసెంబర్ 14: తెలుగుదేశం పార్టీకి గ్రామాల్లో మంచి పట్టుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యనిర్వహక కార్యదర్శి జక్కలి అయిలయ్యయాదవ్ అన్నారు. చౌటుప్పల్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ఆమె తనయుడు సందీప్‌రెడ్డి కార్కెడం పాత విషయమేనన్నారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అధికార పార్టీకి దగ్గరయ్యారన్నారు. నాయకులు పార్టీ వీడినంత మాత్రాన గ్రామాల్లో పార్టీకి నష్టమేమిలేదన్నారు. కార్యకర్తలతో పల్లెల్లో టీడీపీ పటిష్టంగానే ఉందన్నారు. పార్టీలు మారుతున్న నేతలకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎం.డి.హన్నుబాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు బడుగు లక్ష్మయ్య, గ్యార కిష్టయ్య, ఎరుకల మల్లేశం, గంగాపురం గంగాధర్, ఎర్రగోని లింగస్వామి, బొంగు బాదుషా, యాట వెంకటేశం, తడక కోటేశ్వర్, ఎం.డి.వహీద్, పోలోజు శ్రీ్ధర్‌చారి, గౌరికల్ ప్రభాకర్, పి.కృష్ణ, అహ్మద్‌బాబు, గ్యార సుధాకర్, మార్గం శివకుమార్, పాశం రఘుపతి, చింతపల్లి భూపాల్‌రెడ్డి, నల్ల పర్వతాలు, తిరందాసు నరసింహా, గుర్రం యాదగిరి, కృష్ణయ్య, బోదుల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దు
* చౌటుప్పల్‌కు చేరిన సైకిల్ ర్యాలీ
చౌటుప్పల్, డిసెంబర్ 14: ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రారంభమైన సైకిల్ యాత్ర గురువారం చౌటుప్పల్‌కు చేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సైకిల్ ర్యాలీకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సైకాలజిస్ డాక్టర్ వీరేందర్, సామాజిక విశే్లషకురాలు దేవి ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. మనోబలంతో మానసిక వత్తిడిలు, సంఘర్షణలు, భయాలను తొలగించుకోవాలని సూచించా రు. విద్యార్థులు బ్రతుకును బ్రతుకులాగానే బ్రతకాలన్నారు. ఆత్మహత్యలు చేసుకోని కుటుంబాలను క్షోభకు గురిచేయవద్దన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. జీవితంలో ఏ సమస్యను చావుతో ముగించకూడదన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకున్నారు. కార్యక్రమంలో బ త్తుల శంకరయ్య, సైకిల్ యాత్ర డైరక్టర్ వి.వి.రావు, ఎం. మల్లారెడ్డి, రామచంద్రం, దయాకర్,జంగ య్య, శ్రీనివాసులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.