నల్గొండ

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, డిసెంబర్ 14: నిరక్షరాస్యతను నిర్మూలించి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న సంకల్పంతో నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్దీపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఉద్దీపన కింద పనిచేస్తున్న వాలంటీర్లకు చె క్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సైతం ఆంగ్ల విద్యా బోధన అమలు చేసి విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్న దృఢ సంకల్పంతో తాను స్వయంగా ఎంపీపీల సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్దీపన కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని తెలిపారు. మొదట నార్కట్‌పల్లి మండలంలో ఉద్దీపనను అమలుచేయగా, సత్ఫలితాలు సాధించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అమలుపరిచి పేద విద్యార్థులకు సైతం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆంగ్ల విద్యను అందించి విద్యార్థులను మేథావులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీడీవో సురేష్, మండల విద్యాధికారి నర్సింహా, ఎంపీటీసీ ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.
క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
క్రిస్‌మస్ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న క్రైస్తవులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నార్కట్‌పల్లిలో ఎమ్మెల్యే ప్రారంభించారు. తహశీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్యయాదవ్, ఎంపీటీసీ ముత్యాలు, సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, తదితరులు పాల్గొన్నారు.

అన్ని మతాలకు సముచిత స్థానం
* ఎమ్మెల్యే వేముల వీరేశం
కట్టంగూర్, డిసెంబర్ 14: రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు సముచిత స్థానం ఇస్తుందని నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వా రా అందిస్తున్న దుస్తులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను, సాంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు చెప్పారు. అందువల్లే రాష్ట్రంలో ఎలాంటి మత ఘర్షణలకు తావులేకుండా అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు సంబంధిన వారి పండుగలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలో వెయ్యి మంది పేదల చొప్పున దుస్తులు పంపిణీ చేయడంతో పాటు విందును ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవుల ప్రార్ధన మందిరాలైన చర్చిలకు మరమ్మత్తులు చేసేందుకు ఒక్కోచర్చికి రూ.30వేల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ లింగస్వామి, జడ్పీటీసీ మాద యాదగిరి, ఎంపీడీవో గోనే మోహన్‌రావు, తహశీల్ధార్ తిరందాసు వెంకటేశం, పాస్టర్‌లు మర్రి రాజు, యోహోవాదాసు , తదితరులు పాల్గొన్నారు.