నల్గొండ

నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, డిసెంబర్ 14: నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. గురువా రం మండల కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో మండల కౌన్సిల్ సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ చర్లగూడెం భూనిర్వాసితులు నష్టపరిహారం కోసం న్యాయమైన పోరాటం చేస్తుంటే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి పోలీస్ బలగాలతో లాఠీఛార్జీ చేయించిందన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి తిరుగుబాటు ఎదురవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న కేసీ ఆర్ ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గర పడుతున్నాయని విమర్శించారు. ఈ నెల 18 నుండి జనవరి 10 వరకు గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పా లక వర్గాల దోపిడీని ప్రజల్లో ఎండగట్టి చైతన్యం చేయాలని కార్యకర్తలకు సూ చించారు. సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ఈదుల బిక్షంరెడ్డి, నేతలు అల్లెం యాదగిరి రెడ్డి, ఐతపాక జంగయ్య, ఆకుల రఘుమయ్య, బూడిద సురేష్, చల్లం పాండురంగారావు, ఎరుకలి యాదయ్య, జంగయ్య, కొమరయ్య, సత్త య్య, గిరి, ఇక్కిళ్ల మహేందర్, తదితరులు పాల్గొన్నారు.