నల్గొండ

కార్పొరేట్ వైద్యం ఘనత కేసీఆర్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, డిసెంబర్ 17: పేదలకు కార్పొరేట్ వైద్యం తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం స్ధానిక క్యాంప్ కార్యాలయంలో పట్టణానికి చెందిన దుర్గయ్యకు సీఎం రిలీఫ్ ఫం డ్ నుంచి మంజూరైన 45,000 చెక్కు ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి ఆపదలో ఉన్న పేదవారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నా రు. ఆపదలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకోవాలని అడిగిన వెంటనే నిధులను మంజూరు చేస్తున్న సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నగర పంచాయతీ చైర్మన్ కేతావత్ మంజ్యానాయక్, జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ, నగరపంచాయతీ వైస్‌చెర్మన్ నల్లగాసు జాన్‌యాదవ్, వైస్ ఎంపీపీ దూధిపాళ వేణూధర్‌రెడ్డి, కమీషనర్ పూర్ణచందర్‌రావు, కౌన్సిలర్లు వడ్త్య దేవేందర్, చీద ళ్ళ గోపి, పొట్ట సుగుణయ్య, ఆసిఫ్, నేతలు పి.సైదులు, కరుణాకర్, బొడ్డుపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌సీసీ విద్యార్థులకు శిక్షణ
* విద్య, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు
నల్లగొండ రూరల్, డిసెంబర్ 17: విద్యార్థులు చదువుతో పాటు కెరీర్ నిర్మాణం దిశగా దృష్టి పెడుతూ ఎన్‌సిసి కోర్సు శిక్షణ పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎన్‌సిసి కోర్సు విద్యార్థులకు రిజర్వేషన్ల వసతి ఉండటంతో తమ భవిష్యత్ లక్ష్యాల సాధనలో ఎన్‌సిసి సర్ట్ఫికెట్లు ఉపయోగపడుతాయన్న ముందుచూపుతో విద్యార్ధిని, విద్యార్థులు ఎన్‌సిసి కోర్సులో చేరుతున్నారు.
నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియర్ కళాశాలల విద్యార్థులు ప్రస్తుతం ఎన్‌సిసి బి, సి సర్ట్ఫీకెట్ కోర్సు శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎన్‌సిసి విద్యార్థులకు ఆయుధాల పనితీరు, వినియోగం, శారీరక పటుత్వం, పోరాటాల్లో నైపుణ్యంతో, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా అందించాల్సిన సేవల పట్ల శిక్షణ అందిస్తున్నారు. తరగతులతో పలు ప్రత్యేక శిబిరాలు సైతం నిర్వహించి ఎన్‌సిసి విద్యార్థులను కోర్సు పూర్తయ్యేసరికి మంచి నైపుణ్యంతో పంపిస్తామని కోఆర్టీనేటర్ విఘ్నేశ్వర్‌రెడ్డి తెలిపారు.