నల్గొండ

సమగ్ర చట్టం తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుర్కపల్లి, డిసెంబర్ 17: అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకరావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని తిరుమలాపురం గ్రామంలో నిర్వహించిన హమాలీ కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి పార్లమెంట్‌లో సమగ్ర చట్టం తీసుకరావాలని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మృతి చెందిన హమాలీ కార్మికుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. భూములు లేని కార్మికులకు మూడెకరాల భూమి, వారి పిల్లలకు ఉచిత విద్యనందించాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క హమాలీ కార్మికుడికి 3 వేల రూపాయల పింఛన్, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరుచేయాలని కోరారు.సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి కలకుంట్ల సత్యనారాయణ, నాయకులు ఎస్‌కె.జమాల్, వసంత, కనకమ్మ, బిక్షపతి, హమాలీ కార్మికులు డొంకెన కిషన్, రవీందర్‌రెడ్డి, నాగపూరి సత్తయ్య, మల్లేశం, వెంకటేశ్, కిష్టయ్య, టి.బాలనర్సయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
*సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భిక్షపతిరావు
చిట్యాల, డిసెంబర్ 17: వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం రాష్ట్ర వ్యవస్ధాపక అధ్యక్షుడు పల్లపు భిక్షపతిరావు డిమాండ్ చేశారు. మండలం లోని ఉరుమడ్లలో ఆదివారం నిర్వహించిన వడ్డెరల సమావేశానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది వడ్డెరలు సం ఘటితం అయ్యి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. జనవరి 21 న జరిగే వడ్డెర రాష్ట్ర మహాసభలకు వేల సంఖ్యలో వడ్డెరలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్దుడు రాష్ట్ర మహాసభల కోసం తన వంతుగా 10 వేల సాయాన్ని భిక్షపతిరావుకు అందజేశారు. సమావేశం అనంతరం వడ్డెర సంఘం ఉరుమడ్ల గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రూపని నర్సింహ్మ, ప్రధాన కార్యదర్శిగా గుర్రం లింగస్వామి, ఉపాధ్యక్షులు గా పల్లపు బజారును ఎన్నుకున్నారు. రూపని రామచం ద్రం, రూపని యాద య్య, పల్లపు ఇస్తారి, రూపని అంజయ్య, ఒర్సు అంజయ్య, రూపని ఎల్లయ్య, రూపని శంకరయ్య, రాములు, వరికుప్పల వెంకన్న, పల్లపు చంద్రయ్య, రూపని చంద్రయ్య, భిక్షమయ్య, తదితరులు పాల్గొన్నారు.