నల్గొండ

విద్యార్థి వేదిక మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, డిసెంబర్ 17: తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర ఐదో మహా సభ ఈ నెల 20, 21న కరీంనగర్‌లో జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006 అక్టోబర్ 26న ప్రజాస్వామిక తెలంగాణ, కామన్ స్కూల్ విద్యావిధానం, శాస్ర్తియ విద్య లక్ష్యంగా ఏర్పడి న తెలంగాణ విద్యార్థి వేదిక 11 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఈ కాలంలో విద్యార్థుల సమస్యలపై పలు పోరాటాలు చేశామన్నారు. అంతటా కామన్ స్కూల్ విద్యా విధానం ప్రవేశపెట్టాలని, ఇందుకై పల్లెబాట పేరుతో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతామన్నారు. తెలంగాణలో విద్య, నిరుద్యోగ సమస్యతో పాటు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ గోపినాథ్, టీవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ సంజీవ, టీపీఎఫ్ అధ్య క్ష, కార్యదర్శులు నర్సింహా, సుధాకర్‌రెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమ య్య, విద్యాపరిరక్షణ కమిటీ నాయకులు విజయ్‌కుమార్, రాములు, ఉపేందర్, సంతోష్, వరుణ్, శివ, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
రైతు సమస్యలపై నిర్లక్ష్య వైఖరి
* డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్
రాజాపేట, డిసెంబర్ 17: తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుండటంతో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వార్డు, బూత్ కమిటీల శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజాపేట మండలానికి తపాసుపల్లి రిజర్వాయర్ నుండి సాగు నీరు తెచ్చి రైతులకు సంతోషాన్ని కల్పిస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు రాజాపేట మండలానికి నీళ్లు రాకుండా అడ్డుకున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనైనా మండలానికి సాగు నీరు తెచ్చేందుకు పోరాడుతానన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరికి 2,500 రూపాయల మద్దతు కల్పించాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు నిండిన రైతులకు 3వేల రూపాయల పింఛన్ అందించాలన్నారు. శిక్షణ తరగతుల కో ఆర్డినేటర్ కల్పన, జల సాధన సమితి నాయకులు నాయనాల గోవర్థన్, తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుడిగె పెంటయ్య, బి.తిరుమలేశ్, జనార్దన్‌రెడ్డి, చిలువేరు బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు నెమిలె మహేందర్‌గౌడ్, ఎడ్ల బాలలక్ష్మి, బోనాల కుమార్, జాల రాంరెడ్డి, ఆకిరెడ్డి బాలయ్య, జి.రాజు, కృష్ణమూర్తి,తదితరులు పాల్గొన్నారు.