నల్గొండ

స్పోర్ట్స్ హబ్‌గా నాగార్జునసాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జనవరి 18: స్పోర్ట్ హబ్‌గా నాగార్జునసాగర్‌ను తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటి చైర్మన్ ఎ.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌లో బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో గత పది రోజులుగా జీఆర్‌జీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ బుధవారంతో ముగిసాయి. మొత్తం 64టీంలు పాల్గొనగా మొదటి స్థానంలో సాగర్ పోలీస్ టీం, రెండవ స్థానంలో హాలీయా, మూడవ స్థానంలో రంగుండ్ల గెలుచుకున్నాయి. విజేతలకు గురువారం నాడు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ప్రధమ బహుమతి కింద 20వేల రూపాయలను, ద్వితీయ బహుమతి కింద 15వేల రూపాయలను, తృతీయ బహుమతి కింద విజేతలకు 10వేల రూపాయలను బహుకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో క్రీడాకారులకు శిక్షణ తీసుకోవాడానికి అన్ని వసతులు ఉన్నాయని నాగార్జునసాగర్‌లో స్పోర్ట్స్ హబ్బుగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.
17నుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట,జనవరి 18: యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్ధానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17వ.తేది నుండి 27వ.తేది వరకు 11రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవస్ధానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత,చైర్మన్ బి.నర్సింహ్మమూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టాలైన ఫిబ్రవరి 23న శ్రీ స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం,24న.తిరుకళ్యానోత్సవం,24న జరిగే స్వామి వారి కళ్యానోత్సవానికి ముఖ్యమంత్రి కేసి ఆర్,దేవాదాయశాఖ మంత్రి ఇంధ్రఖరణ్ రెడ్డి,హాజరవుతున్నట్లు తెలిపారు.25న.దివ్యవిమాన రధోత్సవం ఉంటాయన్నారు.27న జరిగే అష్టాత్తర శతఘటాభిషేకంతోబ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.
24నుండి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి క్షేత్రంలో ఈ నెల 20నుండి 23వ.తేది వరకు ఆధ్యయనోత్సవాలు,24వ.తేది నుండి 30వ.తేది వరకు బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అత్యంత వైబవంగా నిర్వహించనున్నట్లు దేవస్ధానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత,చైర్మన్ బి.నర్సింహ్మమూర్తి తెలిపారు.గురువారం కొండపైన దేవస్ధానం కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టాలైన ఈనెల 26నస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం,27న తిరుకళ్యానోత్సవం.28న దివ్యవిమాన రధోత్సవం.29న చక్రతీర్ధం,30న జరిగే అష్టోత్తర శతఘటాభిషేఖంతో బ్రహ్మోతవాలు పరిసమాప్తమవుతాయన్నారు.