నల్గొండ

కులాల మధ్య విద్వేషాలు పెంచుతున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, జనవరి 18: రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తూ వృత్తుల పేరుతో ప్రభుత్వం కులాల మధ్య విధ్వేషాలు పెంచుతుందని సీపీ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని వింజమూరు గ్రామంలో గురువారం జరిగిన 13వ మండల మహా సభలో ఆయన మాట్లాడుతూ ఎస్టీ వర్గానికి చెందిన లంబాడీలు, ఆదివాసీల మధ్య విధ్వేషాలను సృష్టిస్తున్న ఘనత టీ ఆర్‌యస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎస్సీలకు నేటికీ ఎకరం భూమి కూడా ఇవ్వని ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నందున కేసీ ఆర్ చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. అంతకు ముందు సీనియర్ నాయకులు ఆరెకంటి మైసయ్య స్మారక స్థూపాన్ని పల్లా వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. మైసయ్య పార్టీకి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పార్టీ జిల్లాకార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి, మండల కార్యదర్శి ఉజ్జిని యుగేంధర్‌రావు, జిల్లా నాయకులు సత్తయ్య, కాంతయ్య, శ్రీనివాస్, రాధాకృష్ణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
తెరాస కేసీఆర్ ఇంటి పార్టీ
* తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్

మోత్కూర్, జనవరి 18: టీఆర్‌యస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదని, కేసీఆర్ ఇంటి పార్టీ అని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. గురువారం మోత్కూర్ సుమంగళి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఇంటి పార్టీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్ మాట్లాడుతూ టీఆర్‌యస్ ఉద్యమ పార్టీ కాదని, రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును నిర్మించాలన్నా.. ఏ పని చేయాలన్నా ఆంధ్రా కంపెనీల నుండి వస్తువులు తీసుకవస్తూ ఆంధ్రా సర్కార్‌కు ఏజెంట్‌గా పని చేస్తున్నారని ఆరోపించారు. భౌగోళిక తెలంగాణ కాదని, సామాజిక తెలంగాణ రావాలని అన్నారు. ఉద్యమకారులు, దళిత, బహుజనుల చేతుల్లోకి అధికారం వస్తేనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. మంద కృష్ణను అరెస్ట్ చేయడం హేయమైన చర్యన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొమ్మాట వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు యానాల నర్సింహారెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు చాంద్‌పాషా, మోత్కూర్, అడ్డగూడూరు, శాలీగౌరారం అధ్యక్షులు పి.మహేష్, పి.నర్సింహాచారి, మస్తాన్, ఆయా సంఘాల జిల్లా నాయకులు డి.ప్రశాంత్, జీవంత్, బుర్రా శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమాన పనికి సమాన వేతనం కోసం ఉద్యమించాలి
* ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు
నల్లగొండ టౌన్, జనవరి 18: సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కోసం కార్మికులు ఉద్యమించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. గురువారం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం కోసం.. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 9న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపడుతున్నట్లు తెలిపారు.