నల్గొండ

టీడీపీ విలీనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జనవరి 18: తెలుగుదేశం పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో కలపాలని పార్టీ పోలీట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అనవసరమైన వ్యాఖ్యలు చేశారని పార్టీని టీఆర్‌ఎస్‌లో కలపడం అసంభవమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారి అన్నారు. మండల కేంద్రంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు శేపూరి సుదర్శన్ నివాసంలో గురువారం విలేఖరుల సమావేశంలో రజనీకుమారి మాట్లాడారు. టీడీపీ పార్టీ ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ అని ఎవరో వ్యక్తిగత వ్యాఖ్యానాలు ప్రకటించడం ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలను కించపరచడమేనన్నారు. మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీకి ఏమాత్రం సంబంధంలేదని ఆయన చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌పై ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీని ఆపార్టీలో కలపాలని మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు టీడీపీకి నష్టపరిచేలా ఉన్నాయని పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ అభ్యున్నతి కోసం తామంతా కృషిచేస్తున్నామని కార్యకర్తలు నాయకులు నిరంతరం శ్రమిస్తున్నారని పార్టీని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. 22 నుండి చిట్యాల మం డలంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి నిర్వహించనున్నామని తెలిపారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
*ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి
భువనగిరి, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో కందులను అమ్మి మద్దతుధర పొందాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి కోరారు. గురువారం నూతన మార్కెట్‌యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు శుభ్రపరిచి ఆరబెట్టిన కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్‌యార్డులో విక్రయించి క్వింటాలుకు 5,450రూపాయలు పొందాలని అన్నారు. దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేళలా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.