నల్గొండ

హామీలను విస్మరిస్తే గుణపాఠం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 19: రాష్ట్రప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తే గుణపాఠం తప్పదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం టీమాస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహర దీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ధనిక రాష్టమ్రని చెబుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలపై భారం మోపుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, కేజీటుపీజీ విద్య, దళితులకు మూడెకరాల భూమి, మహిళలకు వడ్డిలేని రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో టీమాస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కోట రమేష్, జిల్లా చైర్మన్ వసంత సత్యనారాయణ పిల్లే, స్టీరింగ్ కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, ఖాలేద్ అహ్మాద్, నాయకులు ఎల్గూరి గోవింద్, కోట గోపి, ఎల్గూరి జ్యోతి, వెంకన్న, సాయికుమార్, భాస్కర్‌నాయక్, ఇరుగు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
* ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ, జనవరి 19: వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. పట్టణం లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అల్పాహారం కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వం విద్యార్ధుల సంక్షేమానికి మరిన్ని పధకాలను అమలు చేస్తుందన్నారు. పేద విద్యార్ధులను దృష్టిలో ఉంచుకొని వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పధకం అమలు చేయాలని ప్రభుత్వం అలోచిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని విద్యార్థ్ధులు క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గార్లపాటి జగతయ్య, కార్యదర్శి శిఖిలంమెట్ల బాలరాజు, నాయకులు శిరందాసు కృష్ణయ్య, ధనుంజయ, ప్రిన్సిపల్ భానునాయక్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యాదగిరిగౌడ్, విద్యాకమిటీ చైర్మెన్ నెమ్మికంటి గౌరీశంకర్, చీదళ్ళ గోపి, పి సైదులు, జగిని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.