నల్గొండ

కంది రైతుకు కలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జనవరి 19: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిలు స్వయంగా భువనగిరి నూతన మార్కెట్‌యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 24గంటలు గడిచినా కందుల కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు అధికారులు ఉపయోగిస్తున్న మాయిశ్చర్ మిషన్ కందులను అరబెట్టక ముందు 19శాతం తేమను చూపించి అరబెట్టిన అనంతరం 21శాతం తేమ ఉన్నట్లు చూపించడంపట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంతో పనిచేయని మాయిశ్చర్ మిషన్ ఉపయోగించి కందుల కొనుగోలు చేపట్టలేదని ఆరోపించారు. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారులు దిగి వచ్చి మాయిశ్చర్ మిషన్‌ను మార్చి వెంటనే కందుల కొనుగోలు చేపడుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వలిగొండ మండలం కందిరైతు గుమ్మి సాయిరెడ్డి మాట్లాడుతూ 10రోజులుగా ఆరబెట్టి శుభ్రపర్చిన నాణ్యమైన కందులను మార్కెట్‌యార్డుకు తెచ్చి రోజు గడుస్తున్నా అధికారులు కందుల కొనుగోలు ప్రారంభించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ టౌన్, జనవరి 19: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో డి.నరేందర్‌నాయక్ అనే వ్యక్తి ఇంటిపై రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మహేష్‌బాబు, ఎస్‌ఐ కె.శ్రీకాంత్ సిబ్బందితో శుక్రవారం నాడు దాడి చేసి సుమారు 400 బస్తాల (200 క్వింటాళ్ల) పీడీఎస్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారాన్ని ఒకరు అందించగా వెంటనే దాడి చేసినట్టు తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. వెంకటాద్రిపాలెం గ్రామంలో గతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసిన వారికి నరేందర్ బంధువని తెలిపారు. పోలీసు కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంను పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ రఘుకు అప్పగించామన్నారు. సెక్షన్ 6 ఏ కింద కేసు నమోదు చేశామని డీటీ తెలిపారు.