నల్గొండ

దొరల పాలనపై తెలంగాణ సాంస్కృతిక సైన్యం సమర శంఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జనవరి 19: వేలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనపై సమర శంఖారావాన్ని పూరించేందుకు తెలంగాణ సాంస్కృతిక సైన్యం ఊరూరా ప్రజలను చైతన్యవంతం చేస్తుందని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ సాంస్కృతిక సైన్యం ఆవిర్భావ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఇంటి పార్టీకి అనుబంధంగా పని చేసే సాంస్కృతిక సైన్యం వాడవాడన తిరిగి దొరల పాలన, కుటుంబ పాలనను అంతం చేసేందుకు, బడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాధికారం కోసం.. సామాజిక తెలంగాణే లక్ష్యంగా సాంస్కృతిక ఉద్యమాలు, ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ నెల 21న హైద్రాబాద్‌లో జరిగే సాంస్కృతిక సైన్యం ఆవిర్భావ సభకు కవులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీయస్‌యూ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు లింగంపల్లి నవీన్, ప్రధాన కార్యదర్శి కొండేటి మురళి, నకిరేకల్ ఇన్‌చార్జి సంపత్, జానయ్య పాల్గొన్నారు.