నల్గొండ

నేటినుంచి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జనవరి 21: తెలంగాణ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు నేటి నుండి వారం రోజుల పాటు కన్నులపండువగా జరగనున్నాయి. ఉత్సవాల తొలి రోజు జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో నగరోత్సవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతే కాకుండా బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా దేవస్థాన పాలక వర్గంతో పాటు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పకడ్బంధీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. వారం రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో 24న జడల రామలింగేశ్వరుడి కల్యాణం, 25న తెప్పోత్సవం, 26న స్వామి వారి అగ్ని గుండాలు, 27న అశ్వవాహన సేవ, 28న పుష్పోత్సవం, ఏకాంత సేవ, 29న కూడా ఉత్సవాలు కొనసాగనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి అంజన్‌రెడ్డి తెలిపారు. గత రెండు రోజులుగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ డివి.శ్రీనివాసరావులు చెర్వుగట్టు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పాలక వర్గంతో పలుమార్లు సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షించారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లును సంపూర్ణంగా పూర్తి చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఉత్సవాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్‌తో పాటు పలు శాఖల అధికారులను నియమించి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కోనేరు, కల్యాణ మండపం, మూడు గుండ్లు, అగ్ని గుండాల ప్రదేశం, కొండ కింద గల బస్టాండ్ తదితర ప్రదేశాలను పదే పదే పరిశీలించిన కలెక్టర్ భక్తులకు అసౌకర్యం కలుగకుండా తనదైన శైలిలో ఏర్పాట్లను పూర్తి చేయడంలో సమీక్షలు నిర్వహిస్తూ ఆలయ పాలక వర్గాన్ని ఉత్తేజపరుస్తున్నారు. చెర్వుగట్టులో ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటుచేయడంతో పాటు నార్కట్‌పల్లి, నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, హైద్రాబాద్ ప్రాంతాల నుండి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ నల్లా వెంకన్న పేర్కొన్నారు.
పరుశురాముడు త్రేతాయుగంలో ప్రతిష్టించిన పరమశివుడికి అమావాస్య రోజు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. చెర్వుగట్టులో జడల రామలింగేశ్వరుడి మూల విరాట్‌తో పాటు భక్తాంజనేయ స్వామి దేవాలయం, కాలభైరవ దేవాలయం, రేణుక ఎల్లమ్మ దేవాలయం గలవు. కొండపై ఉన్న మూడు గుండ్ల ప్రదేశానికి గొప్ప చరిత్ర ఉంది.