నల్గొండ

జాతీయ భావజాల విస్తరణతోనే దేశాభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 21: విభిన్న జాతుల నిలయమైన భారత దేశం సర్వతోముఖాభివృద్ధి జాతీయవాద భావజాలం విస్తరణతోనే ముందడుగు వేస్తుందని ఈ దిశగా ఎబివిపి సంస్థ సాగిస్తున్న కృషి ప్రశంసనీయమని జాతీయ నెహ్రు యువకేంద్ర ఉపాధ్యక్షులు పేరాల చంద్రశేఖర్ అన్నారు. మూడు రోజుల పాటు నల్లగొండలో విజయవంతంగా సాగిన ఎబివిపి తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆదివారంతో ముగిశాయి. మహాసభల ముగింపు సమావేశంలో తెలంగాణ జిల్లాల ఎబివిపి ప్రతినిధులను ఉద్ధేశించి మాట్లాడుతు విద్యార్ధి సమస్యల సాధనకే పరిమితం కాకుండా విద్యార్థులను దేశాభివృద్ధి వైపు మళ్లించేలా వారిలో జాతీయ భావాన్ని, దేశభక్తిని (మిగతా 3వ పేజీలో) రగులుకోల్పుతు ఎబివిపి సాగిస్తున్న ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. ఎబివిపి సంస్థ దేశం కోసం ఎందరో కార్యకర్తలను బలిదానం చేసిందన్నారు. వారి బలిదానాల స్ఫూర్తితో నేడు ప్రపంఛంలోనే ఎబివిపి అతిపెద్ద విద్యార్ధి సంస్థగా సగర్వంగా నిలబడిందన్నారు. దేశంలో యువశక్తి ప్రాధాన్యతను గుర్తించి ప్రొత్సహించే ప్రభుత్వం కొనసాగుతుందని యువత భాగస్వామ్యంతో ప్రపంఛంలోనే భారత దేశం ఆదర్శనీయ శక్తిగా ఎదుగనుందన్నారు. విద్యారంగంలో దేశభక్తిని, నైతిక విలువలను ప్రొత్సహించే సంస్కరణలు మరిన్ని రావాల్సివుందన్నారు.
ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ఎల్. అయ్యప్ప మాట్లాడుతు పోరుగడ్డ నల్లగొండలో మూడు రోజుల పాటు ఎబివిపి రాష్ట్ర మహాసభలు విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. మహాసభల్లో విద్యారంగ సమస్యలతో పాటు దేశం ఎదుర్కోంటున్న సవాళ్లు, యువత సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బార్లు, నోటిఫికేషన్లు విజయవంతమైతే లక్ష ఉద్యోగాల కల్పన దిశగా ఇచ్చిన వంద నోటిఫికేషన్లలో ఒక్కటే పూర్తయ్యిందన్నారు. సీఎం కెసిఆర్ పాలన కుటుంబ పాలనగా మారిపోగా కాంట్రాక్టులు, కమిషన్లు ధ్యేయంగా మాయమాటలతో పాలన సాగిస్తు నిరుద్యోగ సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. ప్రభుత్వం లక్ష ఉద్యోగాల హామీ అమలుకు డిమాండ్ చేస్తు వచ్చే విద్యాసంవత్సరం జూన్, జూలైలో లక్ష మందితో ఛలో హైద్రాబాద్ కార్యక్రమం నిర్వహించాలని ఎబివిపి రాష్ట్ర మహాసభల్లో నిర్ణయించామన్నారు. అనంతరం ఎబివిపి ఏటా ఉత్తమ సామాజిక సేవకులకు అందించే జనమంచి గౌరి శంకర్ యువ పురస్కార్ అవార్డును నల్లగొండకు చెందిన పర్యావరణ పరిరక్షకుడు మిట్టపల్లి సురేష్‌గుప్తాకు పేరాల చేతుల మీదుగా అందించి సత్కరించారు. ఈ మహాసభల్లో ఎబివిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ప్రసాద్, అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్, కరణ్‌రాజ్, స్వాగతి సమితి అధ్యక్షులు వినిలారెడ్డి, జిల్లా కన్వీనర్లు జగనం సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.