నల్గొండ

కుల వృత్తుల సంక్షేమానికి దండిగా నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జనవరి 21: సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో కునారిల్లిన తెలంగాణ కులవృత్తుల పరిరక్షణకు, వృత్తిదారుల సంక్షేమానికి సీఎం కెసిఆర్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తు ఖర్చు చేస్తుందని రాష్ట్ర విద్యుత్, షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ వడ్డెర హక్కుల సంఘం నిర్వహించిన వడ్డెర గర్జన మహాసభలో ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణం గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పురోగతిపైనే ఆధార పడి ఉందన్నారు. ఇందుకు గ్రామీణ కుల వృత్తులకు (మిగతా 3వ పేజీలో) ప్రభుత్వం సహకారం అందించాల్సిన అవసరాన్ని రాష్ట్ర సాధన ఉద్యమకాలంలో సీఎం కెసిఆర్ గుర్తించి ప్రభుత్వం వచ్చాకా ప్రతి బడ్జెట్‌లో కుల వృత్తుల సంక్షేమానికి నిధులు పెంచుతు కొత్త పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గొర్రెలు, చేపల పెంపకం, పాడి పోషణ పథకాలు అమలు చేస్తుండగా, రజకులకు ధోబిఘాట్‌లు, చేనేతలకు రాయితీలు, అధునిక పరిజ్ఞానం అందిస్తున్నామన్నారు. వడ్డెరలకు సంక్షేమానికి ఆర్ధికంగా రుణాలు అందించడంతో పాటు రాయితీలపైనే క్వారీల నిర్వాహణకు అవకాశం కల్పించే విషయం పరిశీలిస్తామన్నారు. కాంట్రాక్టు పనుల్లో వడ్డెరలు ముందుకు రావాల్సివుందన్నారు. వడ్డెర సంక్షేమానికి ప్రత్యేక సంఘం ఏర్పాటును సైతం పరిశీలిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెరలకు కూడా టికెట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, రజక సంఘం అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ, బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ వడ్డెర హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లపు భిక్షపతిరావు, నాయకులు రూపాని సైదులు, ఓర్సు అంజయ్య, వెంకన్న, రామచంద్రు, పాండు, లింగస్వామి, మల్లయ్య, వి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.