నల్గొండ

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జనవరి 22: తెలంగాణ సుప్రసిద్ధి శైవ క్షేత్రాల్లో ఒకటైన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే స్వామివారి నగరోత్సవం సోమవారం రాత్రి జిల్లా కేంద్రం నల్లగొండలో వైభవోపేతంగా సాగింది. వందలాది మంది మహిళలు, భజన బృందాల కోలాటలు, బ్యాండు మేళతాళాలు, సన్నాయి వాధ్యాలతో, హర హర మహాదేవ శంభోశంకర నినాదాలతో మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతుల వాహానాలు, శే్వత ఆశ్వాలను కూర్చిన రథాలు, కళ్లు చెదిరే భారీ బాణసంఛా పేలుళ్లతో కనువిందుగా సాగింది. ఉదయం చెర్వుగట్టు గిరి ప్రదక్షిణ, ఆలయ పరివార దేవతాపూజల అనంతరం రాత్రి 7-30కు నల్లగొండలోని టిటిడి కల్యాణ మండపం నుండి ప్రారంభమైన చెర్వుగట్టు స్వామి నగరోత్సవ శోభాయాత్రకు పట్టణ వాసులు, భక్తులు బ్రహ్మరథం పట్టారు. నగరోత్సవానికి బయలుదేరిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరులకు మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలుకా శోభయాత్ర వైభవోపేతంగా ముందుకు సాగింది. భారీ ర్యాలీతో నగరోత్సవ శోభాయాత్ర శివాజీనగర్ సెంటర్ నుండి రామాలయం, గడియారం సెంటర్, బస్ స్టేషన్, ఎస్పీ బంగ్లా మీదుగా వివేకానంద నగర్ వరకు సాగింది. నగరోత్సవాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, దేవస్థానం చైర్మన్ నల్లా వెంకన్న, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డిలు ప్రారంభించారు. ప్రధానార్చకులు రామలింగేశ్వర శర్మ భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు. ఆర్డీవో వెంకటాచారి, దేవస్థానం ఈవో అంజనారెడ్డి, ఎంపిపి రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, జడ్పీటీసి దూదిమెట్ల సత్తయ్య, సర్పంచ్ మల్గ రమణబాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.