నల్గొండ

యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 29:ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్ధానంలో స్వయంభువుల దర్శనాలు ఈ నెల 21వ.తేదినుండి నిలిపివేయడంతో యాదాద్రిలో భక్తుల రద్ది తగ్గింది.బాలాలయంలో దర్శనాలు ప్రారంభమైనప్పటికి భక్తులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.బాలాలయం ప్రారంభమై సుమారు 10రోజులు గడుస్తున్నప్పటికి ప్రధాన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.ఆలయ విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆలేరు మాజి ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ ప్రభుత్వాన్ని ఆనాడే హెచ్చరించారు.ప్రధాన ఆలయ నిర్మాణ సమయంలోను స్వయంభువుల దర్శనాలు కొనసాగించాలని బాలాలయ నిర్మాణంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ప్రభుత్వానికి తెలియపర్చినప్పటికి ప్రభుత్వం,వైటిడి ఏ అధికార్ల మొండి వైఖరి కారణంగానే ఈ పరిస్ధితి తలెత్తిందని పరిశీలకులు బావిస్తున్నారు.కేంద్రమంత్రి దత్తాత్రేయ సైతం ప్రధాన ఆలయ నిర్మాణ పనులు కాలయాపన చేయడం మంచి పద్దతి కాదని భక్తులు స్వయంభువుల దర్శనాల కోసం ఎదురు చూస్తున్నాని ఇటివల పాతగుట్ట సందర్శన సమయంలో అభిప్రాయపడ్డారు.ప్రధానఆలయనిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా ముఖ్యమంత్రి కేసి ఆర్ తక్షణమే దృష్టి సారించాలని పలువురు గట్టిగా కోరుతున్నారు.