నల్గొండ

పప్పు ధాన్యాల కొరతను అధిగమించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, ఫిబ్రవరి 20: గతంలో తీవ్రస్ధాయిలో ఏర్పడిన పప్పు ధాన్యాల కొరత నుండి నేడు బయటపడ్డామని భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈఏడాది కంది పంట సాగు భారీగా రావడంతో దిగుబడి కూడా ఊహించని రీతిలో వచ్చిందన్నారు. గతంలో పప్పు్ధన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవారమన్నారు. నేడు రాష్ట్రంలో ఏవ్యవసాయ మార్కెట్ చూసిన కంది రాశులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్‌పంటగా రైతులు కందిని సాగుచేశారని పేర్కొన్నారు. డ్రిప్స్‌ద్వారా కూడా పంటను సాగుచేయడం చారిత్రాత్మకమన్నారు. కేంద్రం ఎయ్‌ఎస్‌టీ ద్వారా కందులను కొని కేవలం 15రోజుల్లో డబ్బును రైతులకు చెల్లించాలని కోరారు. గతంలో ఎంపీల బృందం ఒత్తిడి మేరకు 30 ఎమ్‌ఎస్‌టీని కేంద్రం 50కి పెంచిందని వివరించారు. తాము ప్రత్యేకంగా చేపట్టిన లక్ష్మినర్సింహస్వామి వృత్తిదారుల ప్రమాదభీమా పథకానికి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. పథకాన్ని చేపట్టాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది సగటున లక్ష 50వేల మంది రోడ్డు ప్రమాదంలో, 284 మంది గీత కార్మికులు మృతిచెందుతున్నారని వివరించారు. ఇలాంటి సంఘటనల నేపధ్యంలో ఇన్సురెస్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాళేశ్వరం ద్వారా (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)లభ్యమయ్యే శ్రీరాంసాగర్ రెండోదశ నీటితో ఏడారిలాంటి తుంగతుర్తి భవిష్యత్తులో సస్యశ్యామలమవుతుందన్నారు. వ్యహాత్యకంగా చేపడతున్న పధకంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈనెల 28న నియోజకవర్గంలోని చిల్పకుంట్లలో మిషన్ భగీరధ పధకాన్ని, మద్దిరాల మండలకేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రులు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్‌కుమార్, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డీనేటర్ శోభన్‌బాబు, మండల పార్టీ అధ్యక్షులు జి.సైదులు, టెలికాంబోర్డు సభ్యులు రాములుగౌడ్, నాయకులు సీతయ్య, వెంకట్‌నారాయణ, పూర్ణనాయక్, రజాక్, రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

భూదాన్‌లో విదేశీయుల సందడి
భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 20: 24 దేశాలకు చెందిన టూరిజం మేనేజ్‌మెంట్ అధికారుల బృందం మంగళవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని టూరిజం పార్కును సందర్శించి భూదానోద్యమానికి సంబంధించిన చిత్రాలను వారు పరిశీలించారు. అనంతరం చేనేత సహకార సంఘం, కార్మికుల గృహాలకు వెళ్లి వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించారు. అదే విధంగా కార్మికుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ప్రభుత్వం చేయూత, గిట్టుబాటు ధర తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించారు. హైద్రాబాద్‌లో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలన కోసం పోచంపల్లిని సందర్శించినట్లు వారు తెలిపారు.