నల్గొండ

నూరు శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 20: మునిసిపాలిటీల్లో ఆస్తిపన్నులను మార్చి నెలాఖరుకల్లా వంద శాతం వసూలు చేయాలని మునిసిపల్ పరిపాలన రీజినల్ డైరెక్టర్ షాహిద్‌మసూద్ అన్నారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన రీజియన్‌లోని 42 మునిసిపాలిటిల్లో సుమారు 60 శాతం పన్నులు వసూలయ్యాయన్నారు. మిర్యాలగూడ మునిసిపాలిటిలో 6.75 కోట్ల రూపాయలు ఆస్తిపన్ను డిమాండ్ ఉండగా, 4.07 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగిందన్నారు. సుమారు 55 శాతం వరకు వసూలు చేశారన్నారు. ప్రతి రోజు బిల్‌కలెక్టర్లకు విధించిన లక్ష్యం మేరకు ఆస్తిపన్ను వసూలు చేయాలన్నారు. వసూలు చేసిన (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)మొత్తం రోజు రోజు బ్యాంకులో జమ చేయాలన్నారు. మొత్తం వంద శాతం పన్నులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే అధికారులు, సిబ్బందిపై చర్యలుంటాయన్నారు. అనంతరం స్థానిక మోర్ షాపింగ్‌కాంప్లెక్స్ ఆస్తిపన్ను వివాదాన్ని పరిష్కరించేందుకు భవన యజమాని తనకు ఫిర్యాదు చేసినందును పరిశీలించామన్నారు. సమావేశంలో మునిసిపల్ కమీషనర్ సి.సత్యబాబు, మునిసిపల్ ఇంజనీర్ కె.శ్రీనివాస్, టీపీఓ ఏండీ.్ఫహీముద్దీన్, రెవిన్యూ ఆఫీసర్ ప్రభాకర్, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్‌లున్నారు.