నల్గొండ

జగన్మోహినిగా లక్ష్మీనరసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 23: యాదాద్రి లక్ష్మినరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు జగన్మోహిని అలకాంర సేవలో అశ్వవాహన రూఢుడై విహరించారు. మృగనరహరిగా ఉగ్ర రూపంలో అరివీర భయంకర స్వరూపుడైన నారసింహుడు క్షీర సాగర మధనం వేళ సుర, అసురులను సమ్మోహితం చేసిన జగన్మోహిని ఆలంకృతుడై భక్తులకు దర్శనిమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యులు స్వామివారికి మంగహాహారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మోహినిగా సుందరరూపుడైన స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించారు. స్వామివారి జగన్మోహిన అలంకార సేవలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి దంపతులు హాజరై పూజలు నిర్వహించారు. వారికి అర్చక బృందం ఆశీర్వరచనాలు అందజేశారు.
సంబరంగా ఎదుర్కోలు
స్వామివారి కల్యాణోత్సవానికి ముందుగా నిర్వహించే ఎదుర్కోలు ఘట్టంలో భాగంగా రాత్రి స్వామివారు పెండ్లికొడుకుగా పట్టువస్త్రాలంకృతుడిగా ముస్తాబై ఆశ్వవాహనం అధిరోహించి మండపానికి చేరారు. క్షిర సముద్ర తనయ లక్ష్మి అమ్మవారు ముత్యాల పల్లకిలో ఆసీనులై మండపానికి చేరారు. అర్చక బృందాలు, అధికారులు వధూవరుల తరుపున రెండు బృందాలుగా ఎదురెదురుగా కూర్చుని పెళ్లి చూపుల తంతును నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఘనతను చాటుతు ప్రవర చదివి పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని వివాహ మూహుర్తం నిర్ణయం, నిశ్చితార్ధం, వరపూజల తంతు నిర్వహించారు. పూలుపండ్లు పరసర్పరం సమర్పించుకున్నారు. పెద్దలు, అర్చక పండితులు లక్ష్మిదేవితో నరసింహుడి వివాహాన్ని నేడు శనివారం ఉదయం 11గంటలకు నిర్వహించేందుకు ముహుర్తం ఖరారు చేశారు. ఇదే రోజు రాత్రి కొండ దిగువన భక్తుల సమక్షంలో వైభవోత్సవ కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. ఎదుర్కోలు ఘట్టం ముగిశాకా స్వామి, అమ్మవార్లను ఆలయానికి చేర్చి మహానివేదన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీత, పలువురు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆలయ పునర్ నిర్మాణం నేపథంలో వరుసగా రెండో ఏడాది కూడా పంఛనారాసింహుడికి ఒకే రోజు రెండు కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉదయం జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ తరుపునా ఆనవాయితీగా సీఎం కెసిఆర్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సివుంది. అయితే ఆయన సోదరి మృతి నేపధ్యంలో ఈదఫా కూడా ఆయనకు బదులుగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. గత ఏడాది కూడా సీఎం కెసిఆర్ కల్యాణోత్సవానికి హాజరుకాలేదు. రాత్రి నిర్వహించే వైభవోత్సవ కల్యాణానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరవుతారని ఆలయ అధికారులు తెలిపారు. కల్యాణోత్సవాలకు ఏర్పాట్లను దేవస్థానం భారీ ఏర్పాట్లు చేపట్టింది