నల్గొండ

ప్రజాసమస్యల పట్ల పాలకులు దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 28: ప్రజా సమస్యల పట్ల పాలకులు దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. సోమవారం అఖిలభారత కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన రాజీవ్ భవన్‌లో పార్టీ పతాకాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరునగరు గంగాధర్ ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ నూతన ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వాటిని తీర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని, ఇప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సుకై పాటు పడ్తున్నదని బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మునిసిపల్ చైర్మన్ టి.నాగలక్ష్మి, ఎంపిపి ఒగ్గు జానయ్య, ఎడిసిఎంఎస్ వైస్‌చైర్మన్ చిరుమరి కృష్ణయ్య, బ్లాక్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతరెడి శ్రీనివాస్‌రెడ్డి, తిరునగరు భార్గవ్, బిక్షంగౌడ్, నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ మగ్దుంపాషా, కౌన్సిలర్లు ఖాజాబేగం, మెరుగు రోశయ్య, ఎండి.మాజిద్, ఇలియాస్‌ఖాన్, నాయకులు ఎండి ఖాదర్, మేడసుచరిత సురేందర్‌రెడ్డి, ఉదయ్‌భాస్కర్‌గౌడ్, కుర్ర విష్ణు, ఉబ్బపల్లి సోములు, గుడిపాటి సైదులుబాబు పాల్గొన్నారు.

పేదరికాన్ని అధిగమించి క్రీడల్లో రాణించాలి
తీ గిరిజన గురుకుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌కుమార్

మిర్యాలగూడ, డిసెంబర్ 28: క్రీడాకారులు పేదరికాన్ని అధిగమించి క్రీడల్లో రాణించాలని రాష్ట్ర గిరిజన గురుకుల సంక్షేమశాఖ కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు.
మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించే రాష్ట్ర ట్రైబల్ స్పోర్ట్స్ స్టార్ ఒలంపిక్స్ క్రీడలను సోమవారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్దులు క్రీడలతోపాటు విద్యలో రాణించాలని ఆయన కోరారు. విద్యలో రాణించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని అందువల్ల విద్యార్థులు కష్టపడి చదివి విద్యలో రాణించాలని ఆయన కోరారు. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోని ఉన్నతస్థానాలను అధిరోహించాలని ఆయన కోరారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోని విద్యలో రాణించాలని ఆయన కోరారు. విద్యార్థులు చదువులో క్రీడలు ఒక భాగమని, చదువులో రాణించాలని ఆయన కోరారు. పర్వతారోహణం పూర్ణను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. క్రమశిక్షణతో ఉండి విద్యార్దులు క్రీడలలో, విద్యలో రాణించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం క్రీడాకారులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడలను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన అన్నారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. గిరిజన విద్యార్థుల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కాగా తొలుత క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిటిడబ్ల్యుఓ నరోత్తంరెడ్డి, డిఎస్‌పి గోనెసందీప్, గురుకుల పాఠశాల క్రీడల అధికారి రమేశ్‌కుమార్, గురుకులం ఇంజనీర్ కవితరాజు, ప్రిన్సిపాల్ కరుణాకర్, డిసిఓలు బురాన్, చంద్రశేఖర్, వెంకటరత్నం, సదానందం పాల్గొన్నారు.