నల్గొండ

మానవూరు-మన ఇంటి పార్టీ రాష్ట్రానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్,్ఫబ్రవరి 23:గ్రామ గ్రామాన ప్రభుత్వ సంక్షేమ పధకాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరిచే మనవూరు-మన ఇంటిపార్టీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో నిర్వహించేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని రాష్ట్ర రవాణ శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.శుక్రవారం మంత్రి మహేందర్‌రెడ్డికి ప్రభుత్వ విప్ సునిత ఘనస్వాగతం పలికారు.ఆర్టీసీ బస్‌స్టాండ్ నుండి మైలార్‌గూడెం వరకు మంత్రికి ప్రభుత్వ విప్‌కు ఘనస్వాగతం పలికిన నాయకులు,కార్యకర్తలు గుట్ట పురవీధుల గుండా కార్యకర్తలకు అభివాదం చేస్తూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు.మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విసృతంగా తీసికెల్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషిచేయడం మంచి పరిణామమని అన్నారు.యాదగిరిగుట్టలో నూతన ఆర్టీసీ భవనం కోసం 15 ఎకురాలలో రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి బస్సులు వచ్చే విధంగా భక్తులకు అధునాతన పద్ధతిలో ఆధునీకరిస్తున్నామని అన్నారు. ఆటో కార్మికులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.మనవూరు-మన ఇంటి పార్టీ కార్యక్రమాన్ని తీసుకుని 20 రోజుల పాటు గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యపరిచిన ప్రభుత్వ విప్ గొంగిడి సునితను,రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిని అభినందించారు.
కాంగ్రేస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తారని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలో కాంగ్రేస్ నాయకులకు అర్ధం కావడంలేదని అన్నారు..ఏ జిల్లాకు వెళ్లికు వెళ్లిన ఆ జిల్లాలో కాంగ్రేస్ నాయకులకు ముఖ్యమంత్రులుంటారని వర్గ పోరుతో సతమతవౌతున్నారని అన్నారు.ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన తిరుగుతూ సంక్షేమ పధకాలు అందని వారికి అందిస్తామని అన్నారు.ఎంపీ బూరనర్సయ్యగౌడ్ మాట్లాడుతూ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఉందని ప్రతి ఒక్క నిరుపేదకు సంక్షేమ పధకాలు నేరుగా అందుతున్నాయని అన్నారు.ఆటో కార్మికులు,వందల మంది కాంగ్రేస్,టీడీపీ,బీజేపీల నుండి టీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, ఎంపీపీ గడ్డమీది రవీందర్‌గౌడ్,జడ్‌పీటీసీ కర్రె కమలమ్మ,సర్పంచ్ బూడిద స్వామి, ఎంపీటీసీలు సీసకృష్ణ,మండలపార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, గడ్డమీది రవీందర్ గౌడ,అంకం నర్సింహ్మ,సీనియర్ నాయకులు,నువ్వుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.