నల్గొండ

దళారుల కందుల సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 23: నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారస్తుల కందుల అక్రమ విక్రయ వ్యవహారాన్ని శుక్రవారం టి.జెఏసి బృందం బట్టబయలు చేసింది. మార్కెట్ యార్డులో నిల్వ చేసిన కందుల రాసులు, బస్తాల్లోని దళారీ వ్యాపారులకు చెందిన 508బస్తాల కందులను గుర్తించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్‌ఐ సందీప్ వెంటనే మార్కెట్‌కు చేరుకుని జెఎసి బృందం గుర్తించిన కందుల వివరాలపై విచారణ చేపట్టారు. ఈ విఛారణలో సదరు కందులు దళారీ వ్యాపారులవేనని ప్రాథమికంగా నిర్ధారించిన ఆర్‌ఐ వెంటనే వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా టి.జెఎసి జిల్లా కన్వీనర్ పందుల సైదులుగౌడ్ మాట్లాడుతు టి.జెఎసి ముందునుండి ఆరోపిస్తున్నట్లుగానే కందుల మార్కెట్‌లో దళారీ వ్యాపారుల కందుల వి
క్రయాలు జోరు సాగుతున్న విషయాన్ని తాము నిరూపించామన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు మార్కెట్‌లోకి నిజమైన రైతుల కందులకు మాత్రమే అనుమతించి, దళారీ వ్యాపారుల అక్రమ విక్రయాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా కేంద్రంలో పోలీసుల కార్డన్ సెర్చ్
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 23: జిల్లా కేంద్రంలోని పలు ముఖ్య కూడళ్లలో, వివిధ ప్రాంతాల్లో, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పోలీసులు శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఉన్న దుకాణాలను తనిఖీ చేశారు. అదే విధంగా రహదారులపై వెళ్తున్న వాహనాలను ఆపి వాటికి సంబంధించిన కాగితాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను, అనుమానితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి వివరాలు రాబట్టారు.

రూ.40వేల కోట్లతో బడుగుల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే పైళ లశేఖర్‌రెడ్డి
భువనగిరి, ఫిబ్రవరి 23: బడుగు బలహీన వర్గాల అభివృద్ధికోసం రాష్ట్రంలో 40వేల కోట్లరూపాయలతో సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత దేశంలోనె ఒక్క తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల అభివృద్ధి కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 17మందికి వైద్య ఆరోగ్య చికిత్సల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, పేదింటి యువతుల వివాహాలకై 18మందికి షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను భువనగిరి ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ క్రిష్ణారెడ్డిలు అందజేసారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమంకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లొ ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్లతోపాటు నగదు ప్రోత్సాహకం, పుట్టిననాటినుండి ఉచితంగా టీకాలు, కళ్యాణలక్షి, ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ, ఒబీసీల విద్యార్థులకు గురుకుల హాస్టళ్లను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యతోపాటు సన్నబియ్యంతో బోజనం, అర్హులైన నిరుద్యో గులకు ఉపాధిఅవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంశాఖలలో ఖాలీలను భర్తిచేసేందుకు నోటిఫికేషన్లు జారి చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్విలావణ్య శ్రీనివాస్‌గౌడ్, ఎంపిపి వెంకటేశ్‌యాదవ్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ బర్రె మహాలక్ష్మి, టిఆర్‌ఎస్ నాయకులు గోమారి సుధాకర్‌రెడ్డి, సుబ్బూరు బీరుమల్లయ్య, మహిళానాయకురాలు రేష్మ, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.