నల్గొండ

చేనేత కార్మికులు పారిశ్రామికులుగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఫిబ్రవరి 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ చేనేత కార్మికులు పారిశ్రామికులుగా ఎదగాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో నిర్మించిన వీవింగ్, డైయింగ్ వర్క్‌షెడ్‌ను శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. గ్రామంలో పర్యటించి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. మగ్గాలను పరిశీలించి మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధరల గురించి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర రుణాలను చేనేత కార్మికులకు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో బూర మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. చేనేత ఉత్పత్తులకు విస్తృతంగా మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. చేనేత ఉత్పత్తులకు దేశవిదేశాలను మంచి డిమాండ్ ఉందని గుర్తుచేశారు. దేశాభివృద్ధిలో చేనేత కీలకంగా మారిందన్నారు. కుల వృత్తుల్లో చేనేతకు ఆదరణ అధికంగా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, చేనేత మంత్రి కేటీఆర్ చేనేతకు మంచి భవిషత్తును ఇచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. చేనేతను రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూలు, రంగు, రసాయనాలకు సబ్సిడీ అందిస్తుందన్నారు.
చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా చేనేత ఉత్పత్తులు ఉండాలన్నారు. అందుకు ప్రభుత్వం అసవరమైన శిక్షణ ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోని కార్మికులు అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. చేనేత సహకార సంఘం చైర్మన్ మిర్యాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో హైండ్లూమ్ జేడీ పూర్ణచందర్‌రావు, ఎన్‌డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, హిమజ్‌కుమార్, డాక్టర్ కె.రమేష్, సతగోపమ్, లింగమూర్తి, త్రిమూర్తికుమార్, పెద్దిటి బుచ్చిరెడ్డి, వల్లకాటి తులసీరామచంద్రం, పిల్లలమర్రి శ్రీనివాస్, మిర్యాల గోవర్ధన్, గర్దాసు బాలయ్య, తిరందాసు నరసింహా, గుండు వెంకటేశం, గుండు లక్ష్మణ్, వల్లకాటి శ్రీశైలం, గుండు నాగయ్య, వనం యాదగిరి, అనుమమ్మ, అండాలు తదితరులు పాల్గొన్నారు.