నల్గొండ

పేదల మెరుగైన ప్రయాణం కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో రవాణ వ్యవస్థలేని చోటకు రోడ్డు వేసి గ్రామ గ్రామాన ఆర్టీసీ బస్సులను నడుపుతామని, ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్డురవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ పరిసరాలను మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునితమహేందర్‌రెడ్డి పరిశీలించిన అనంతరం డిపో మేనేజర్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ పేదల పక్షపాతని, ఆర్టీసీ నష్టాని నివారించేందకు వెయ్యి కోట్లను కేటాయించారని, రాబోయే రోజుల్లో గ్రామా గ్రామానికి పల్లె బస్సులను నడుపుతామని, రెండేండ్లలో ఆర్టీసీలో వౌలిక వసతుల కోసం 135 కోట్లతో ఆధునీకరిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 97 డిపోలకు గాను 27 డిపోలు లాభాల భాటలో నడుస్తున్నాయని మిగిలిన డిపోలలో నష్టాలు వస్తున్నా ప్రభుత్వమే భరించి ప్రజలకు సేవలను అందిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ లాభాల బాటలో నడిచేందకు కార్మిక సంఘూల కృషి గొప్పదని, 24 గంటలు ప్రజలకు సేవలను అందించే గొప్ప సంస్థ ఆర్టీసీ కార్మికులదని అన్నారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి ఎంతో ఉందని ఆర్టీసీని లాబాల భాటలో నడిపేందకు ఆర్టీసీ యాజమాన్యం, కార్మికులు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వప్నరవీందర్‌గౌడ్,జడ్‌పీటీసీ కర్రె కమలమ్మ,రీజనల్ మేనేసర్ సుధారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాలె సుమలత,ఆర్ ఎమ్,డిఫో మేనేజర్,కార్మికులు పాల్గొన్నారు.

154 సబ్సిడీ గొర్రెలు పట్టివేత
* రెండు డీసీఎంలు స్వాధీనం
పెద్దఅడిశర్లపల్లి, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమం కోసం అందించిన సబ్సిడీ గొర్రెలను అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తుండగా శుక్రవారం గుడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏఎస్‌ఐ ఎల్లయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవరకొండ మండలంలోని పడమటిపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారుల 154 సబ్సిడీ గొర్రెలను గుంటూరుకు చెందిన దళారులు బొమ్ము శ్రీను, మేకల ఎల్లయ్య అక్రమంగా తరలిస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు డీసీఎంలలో ఉన్న గొర్రెలను స్వాధీనం చేసుకొని పశువైద్యాధికారి మహేందర్‌రెడ్డి ద్వారా పరిశీలింపజేశారు. దీంతో సబ్సిడీ గొర్రెలుగా గుర్తించినట్లు తెలిపారు. పట్టుబడిన సబ్సిడీ గొర్రెలను భీమనపల్లి, ఘనిపల్లి గ్రామాల్లో ఎంపికైన ఏడుగురు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తహశీల్దార్ ఏఆర్.నాగరాజు తెలిపారు.