నల్గొండ

చైతన్యానికి ప్రతీక ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 18: ఉగాది చైతన్యానికి, సృజనాత్మక ఆలోఛనకు ప్రతీకని శ్రీ విళంబి నామసంవత్సరం అందరి జీవితాల్లో శుభాన్ని ప్రసాదించాలని కవి, రచయిత ఆచార్య గోపి అన్నారు. ఆదివారం సాహితీ మేఖల సంస్థ, జిల్లా సమాచార శాఖల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నిర్వహించిన ఉగాది వేడుకలు, కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తొలకరి జల్లులు కురిసినట్లుగా ఉగాది వేళ కవి, రచయితల నుంచి నూతన కవితలు జాలువారుతాయన్నారు. తెలుగు భాషా వికాసం, సాంస్కృతిక వికాసం ఉగాది కవి సమ్మేళనలతో ఫరిఢవిల్లాలన్నారు. అర్చక పండితులు దేవులపల్లి నాగరాజు శర్మ పంచాంగ పఠనంతో ప్రారంభమైన ఉగాది వేడుకలకు అధికారులు, ప్రజాపతినిధులు, నాయకులు, కవి, రఛయితలు హాజరయ్యారు. అనంతరం రఛయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కవి సమ్మేళనం కవుల కవితాగానాలతో సాహితీ గుబాళింపులు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. ఉగాది ప్రశస్తి, ప్రకృతి విశిష్టత, సామాజిక చైతన్య పూరిత అంశాలతో పద్య, వఛన, అభ్యుదయ కవితలతో 58మంది కవులు, రచయితలు ఉత్సాహంగా కవితాగానం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్.గోపికి సాహితీ మేఖల జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన సూర్య ధనుంజయ్, మెరుగు వెంకటదాసు, దేవులపల్లి కృష్ణమూర్తి, పెన్న అనంతరాశర్మ, ఎం.వి.గోనారెడ్డి, ఎంవి.విద్యాసాగర్, సిహెచ్.నారాయణదాసు, గుండ్ల అంజనేయులు, పి.బాలు, ఖాజామెయినొద్ధిన్‌లను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో వెంకటాచారి, సాహితీ మేఖల సంస్థ ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య, ధనుంజయనాయక్, అక్కిరాజు సుందర రామకృష్ణ, మంచుకొండ చిన భిక్షమయ్య, కవులు కొలనుపాక మురళీధర్‌ఱవా, చకోన చొల్లేటి ప్రభాకర్‌రెడ్డి, బెల్లంకొండ శ్రీరాం, గజివెల్లి సత్యం, నర్సయ్య, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, దీకొండ వెంకటేశ్వర్లు, ప్రమీత్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట: ఎంపీ
మునుగోడు,మార్చి 18: గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కెటాయిస్తుందని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్,మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు అన్నారు.
ఆదివారం మండల కేంద్రంలో గ్రామీణ ఉపాధి హామి పథకం, ఎంపి నిధుల కింద 20లక్షల వ్యయంతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అనంతరం వారు మాట్లాడారు. గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా గ్రామాలలో సమస్యలు తిష్టవేశాయన్నారు. త్వరలో డిండి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి సాగునీటితో మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎంపిపి మేడి నాగలక్ష్మి, టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం సత్యం, జిల్లా నాయకులు బొడ్డు నాగరాజుగౌడ్, ఐతగోని లాల్‌బహుదూర్‌గౌడ్, మేడి యాదయ్య, సింగిల్ విండో చైర్మన్ బండా పురుషోత్తంరెడ్డి, ఎంపిటిసిలు పందుల బాస్కర్, నకరకంటి స్వామిగౌడ్, బొడ్డు నర్సింహ్మగౌడ్, సర్పంచులు పందుల నర్సింహ్మ,ఆకుల వెంకన్న, వీరమళ్ళ నర్సింహ్మగౌడ్, దొడ్డి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి పానీయాలతో ఆరోగ్యం
రామగిరి, మార్చి 18: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్‌యూటిఎఫ్), జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ గడియారం సెంటర్‌లో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రజలకు, పిల్లలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ప్రకృతి పానీయాలతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని, శీతల పానీయాలు అనర్ధదాయకమన్న సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా యూటిఎఫ్, జెవివిలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, డిఈవో పి.సరోజిని, ఆయా సంఘాల నాయకులు వెంకటరమణారెడ్డి, గిరి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.రాజశేఖర్, ఎడ్ల సైదులు, పి.వెంకటేశ్, వెంకటయ్య, నరసింహా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పేద వధువు వివాహానికి
రూ.50 వేల ఆర్ధిక సహాయం
నల్లగొండ రూరల్, మార్చి 18: నల్లగొండ పట్టణంలోని నిరుపేద కౌసర్ కూతురు వివాహానికి తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, టిఆర్‌యస్ నియోజక వర్గ భాద్యులు కంచర్ల భూపాల్ రెడ్డిలు 50 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, పట్టణ కార్యవర్గ నాయకులు, మైనార్టీ నాయకులు, బషీర్, కరీం పాష, ఫారీద్, జమాల్, జాఫర్, అన్వర్, ఖాసీం, మోహిన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.