మెదక్

ఎన్నికలకు సన్నద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 18: టిఆర్‌ఎస్ శ్రేణులు నల్లగొండ అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సన్నద్ధంగా ఉండాలని, సీఎం కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి ఆశీర్వాదం పొందేందుకు కృషి చేయాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నల్లగొండ అసెంబ్లీ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. కంచర్ల భూపాల్‌రెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం అర్చక పండిత బృందం శాస్తయ్రుక్త పూజలు, మేళ తాళాల మధ్య బండ నరేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గృహప్రవేశ పూజలను కంచర్ల దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని కార్యకర్తలకు అందించారు. అర్చకులు వాసుదేవశర్మ పంచాంగ పఠనం నిర్వహించారు. అనంతరం బండ విలేఖరులతో మాట్లాడుతూ నూతన పార్టీ కార్యాలయం వేదికగా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పతనం, టిఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు ముందుకు దూకాలన్నారు. కోమటిరెడ్డి రాజకీయ పతనం మొదలైందని రానున్న ఎన్నికల్లో ఆయన ఓటమి తధ్యమన్నారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధన దిశగా సాగిస్తున్న కృషిని టిఆర్‌ఎస్ శ్రేణులు ఉగాది విళంబి నామసంవత్సరంలో విజయవంతం చేయాలన్నారు. కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం తనతో పాటు కార్యకర్తలందరికీ సంతోషదాయకమన్నారు. ఇక నుంచి నల్లగొండ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌కు అన్ని మంచిరోజులేనని, సీఎం కెసిఆర్ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిని ఓడించేందుకు నన్ను ఆశీర్వదించి పంపారన్నారు. మునుముందు కోమటిరెడ్డికి రాజకీయంగా ముచ్చెమటలు పట్టిస్తామన్నారు. శాసన సభ్యత్వం రద్దుతో పదవి పోయి పిచ్చి లేచినట్లుగా కోమటిరెడ్డి ఆగమాగమై కెసిఆర్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. మళ్లీ కుంటి సాకులు, సెంటిమెంట్లతో ఉప ఎన్నికలొస్తాయన్న భయంతో ప్రజల ముందుకొస్తున్న కోమటిరెడ్డికి కర్రుకాల్చి వాతపెట్టినట్లుగా బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమకోఆర్టీనేటర్ మాలే శరణ్యారెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు సుంకరి మల్లేశ్‌గౌడ్, బోయపల్లి కృష్ణారెడ్డి, భోనగిరి దేవేందర్, అభిమన్యుశ్రీనివాస్, అబ్బగోని రమేష్, ఫరీదొద్ధిన్, దుబ్బ అశోక్‌సుందర్, పిల్లి రామరాజు, లొడంగి గోవర్ధన్, పల్‌రెడ్డి రవిందర్‌రెడ్డి, బకరం వెంకన్న, కరీంపాషా తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల కుటుంబాలకు కోమటిరెడ్డి ఆర్థిక సాయం
దేవరకొండ, మార్చి 18: నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం పెండ్లిపాకల గుడితండా పెండ్లిపాక రిజర్వాయర్‌లో మునిగి చనిపోయిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.2లక్షల 50వేల ఆర్ధిక సహాయం అందించారు. కోమటిరెడ్డి తరుపునా చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50వేల చొప్పున సదరు ఆర్ధిక సహాయాన్ని కాంగ్రెస్ జిల్లా నాయకులు కేతావత్ బిల్యానాయక్, గుమ్మల మోహన్‌రెడ్డి, పాశం సంపత్‌రెడ్డి, జడ్పీటీసి నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్‌లు అందించారు. ఆదివారం వారంతా గుడితండాకు చేరుకుని బాధిత కుటుంబాలను ఓదార్చి వారికి సహాయం అందించారు. భవిష్యత్‌లో ఆ కుటుంబాలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మందడి శ్రీనివాస్‌రెడ్డి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.