మెదక్

పోలీసు నిబంధనలను ఉల్లంఘిస్తే వెనువెంటనే ఈ-పీటీ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మార్చి 20: పోలీస్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులు, దుకాణదారులపై వెను వెంటనే ఈ-పిటీ కింద కేసులు నమోదు చేస్తామని స్థానిక డీఎస్పీ పద్మనాధుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ-పిటీ యాప్ గురించి సబ్‌డివిజన్‌లోని పోలీస్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. యాప్‌ను ప్రారంభించి ఈ-పిటీ కేసుల నమోదు మంగళవారం నుండే అమలులోకి వస్తుందన్నారు. వైన్స్‌షాపులు రాత్రి 10, బార్లు 11, ఆహార హోటళ్లు 12, కిరాణ, జనరల్, ఫ్యాన్సీ షాపులు రాత్రి 10 గంటలకే మూసి వేయాలన్నారు. అలా చేయని పక్షంలో వెంటనే పోలీస్‌శాఖ ఇచ్చిన ట్యాబ్‌లో ఫోటో తీసి వెంటనే చార్జిషీట్ చేస్తామన్నారు. పోలీసు గాని, నిందితుడు కాని సంప్రదించే అవకాశం లేదన్నారు. అదే విధంగా సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడే అవకాశం లేదన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా దుకాణాలు తెరచి ఉంటే వారి లైసెన్స్‌లు రద్దు చేయాలని, వాణిజ్యశాఖ, కార్మికశాఖలకు తెలియజేస్తామన్నారు. అదే విధంగా మోటార్‌సైకిళ్లు, వాహనాలు అడ్డగోలు నడపడం, పార్కింగ్ చేయడం తదితర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వెంటనే ఈ-పిటీ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అంతా ఆన్‌లైన్‌లో జరిగిపోతుందని జిల్లా ఏస్‌పీ, డీజీపీ కార్యాలయాలకు ట్యాబ్ ద్వారా చార్జీషీట్ వివరాలు వెళ్తాయన్నారు. ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఉండదన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిస్తే జరిమానా కూడ ఉంటుందన్నారు. ప్రజలు పోలీస్‌కు కాకుండా చట్టానికి భయపడేందుకు ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో మిర్యాలగూడ ఒన్, టూ, రూరల్ పోలీస్ ఇన్స్‌పెక్టర్లు జీ.వెంకటేశ్వరరెడ్డి, బీ.సాయిఈశ్వర్‌గౌడ్, ఏం.రమేష్‌బాబులు పాల్గొన్నారు.
పేదింటి పెళ్లికి మరింత ఆసరా

* స్ర్తి,శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ మాలె శరణ్యారెడ్డి
రామగిరి, మార్చి 20: పేదింటి పెళ్లికి మరింత చేయూతనిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని స్ర్తి,శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ మాలె శరణ్యారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో టీఆర్‌యస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు చేయూతనిస్తూ ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని 75,116రూపాయల నుంచి లక్షా 116రూపాయలకు పెంచి తెలంగాణ పేదింటి కుటుంబాలను మరింత ఆదుకొని సీఎం కేసీఆర్ తన ఉదారతను చాటుకున్నారన్నారు. దీని వల్ల 3.60లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరడం హర్షణీయమన్నారు. బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు వంటి అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి తోడ్పాటునందిస్తూ నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలబడుతున్న టీఆర్‌యస్ ప్రభుత్వానికి మహిళా లోకం రుణపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌యస్ మహిళా విభాగం నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాల అధ్యక్షురాళ్లు వనపర్తి జ్యోతి, కొప్పోలు విమలమ్మ, శనగోని సుమతమ్మ, కాసర్ల విజయారెడ్డి, గార్లపాటి రాజేశ్వరి, వాసం తులసమ్మ, కత్తుల లలిత, రేణుక, సరోజ, సునీత, కౌసర్ అక్తర్, అక్తర్ భాను తదితరులు పాల్గొన్నారు.