నల్గొండ

54 శాతం ఉన్న బీసీలకు 3శాతం నిధులా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, మార్చి 20: రాష్ట్రంలో 54శాతం పైగా ఉన్న బీసీలకు తెలంగాణ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచినా బడ్జెట్‌లో కేవలం 3శాతం నిధులు మాత్రమే కేటాయించడం వల్ల బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో బీసీల బడ్జెట్‌పై ప్రభుత్వ వైఖరి అనే అంశంపై ఏర్పాటుచేసిన సదస్సులో అన్ని పార్టీల బీసీ నాయకులు, మేథావులు, కుల, ప్రజా, విద్యార్థి, యువజన, ఉద్యోగ, మహిళా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, యువజన, విద్యార్థి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేశ్, జిల్లపెల్లి ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ బీసీ బడ్జెట్‌పై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీసీల గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. 20వేల కోట్లతో బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటుకు వౌఖిక అంగీకారం తెలిపిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో కేవలం 3శాతం నిధులు కేటాయించడం దారుణమైన మోసంగా భావించాలన్నారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి బీసీలను విభజించి పాలిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని, విభజించు-పాలించు అనే ధోరణిలో ఎంబీసీ కులాలుగా విడగొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సమిష్టి శక్తిని బలహీనం చేసే కుట్రలను ఛేదించాలని సమావేశంలో ముక్తకంఠంగా తీర్మానించారు. యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ మాట్లాడుతూ బీసీ సంఘాలన్నీ సమిష్టిగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకొని మండల, గ్రామాల వారీగా సమైక్య శక్తిగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 70వేల కోట్లు బీసీలకే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిలువేరు కాశీనాథ్, నియోజకవర్గ ఇన్‌చార్జి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిర్యాల యాదగిరి, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేత, నార్కట్‌పల్లి జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్యయాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యాంసుందర్, సీపీఐ నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రవణ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పంకజ్‌యాదవ్, మాజీ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఆయా సంఘాల అధ్యక్షులు కాశీనాథ్, కోట్ల రామలింగం, సిరిప్రోలు వెంకటపతి, వాసుదేవుల వెంకటనర్సు, బిక్షపతి, షణ్మచారి, రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ, యువజన సంఘం నాయకులు ఐతగోని జనార్థన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సబ్సిడీ గొర్రెల అక్రమ రవాణాకు చెక్
* 250 సబ్సిడీ గొర్రెల స్వాధీనం
* 11మంది బైండోవర్
తిప్పర్తి, మార్చి 20: మండల కేంద్రంలోని నార్కట్‌పల్లి - అద్దంకి రహదారిపై సోమవారం రాత్రి రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న 250 సబ్సిడీ గొర్రెలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూర్ మండలం కొండగడపకు చెందిన ఆరుగురు లబ్ధిదారులు, ఆత్మకూర్ (యం) మండలం పెద్దబండకు చెందిన ఇద్దరు లబ్ధిదారుల నుంచి మధ్యవర్తి ఆడిగె ఆనంద్ సబ్సిడీ గొర్రెలను కొనుగోలు చేసి గుంటూరు జిల్లా మాచర్లకు రెండు లారీలలో తరలిస్తుండగా.. తిప్పర్తి పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా సబ్సిడీ గొర్రెలను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు 110 (ఇ) కింద కేసు నమోదు చేసి ఇద్దరు లారీ డ్రైవర్లతో సహా 11 మందిని అదుపులోకి తీసుకొని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ సురేందర్ తెలిపారు. ఎవరైనా సబ్సిడీ గొర్రెలను విక్రయించినా..కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆడశిశువు అమ్మకాన్ని అడ్డుకున్న పోలీసులు
గుర్రంపోడు, మార్చి 20: మండలంలోని గాసీరాంతండాకు చెందిన దంపతులు ఆడపిల్లను విక్రయిస్తుండగా గుర్రంపోడు పోలీసులు అడ్డుకున్నారు. ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం గాసీరాంతండాకు చెందిన మేగావత్ నరేష్, సోని దంపతులకు జనవరి 10న మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో రెండో సంతానంగా ఆడపిల్ల జన్మించింది. తమకు ఆడపిల్ల వద్దని నల్లగొండ మండలానికి చెందిన చర్లపల్లి లింగస్వామి దంపతులకు పిల్లలు పుట్టే అవకాశం లేనందున ఈ పాపను పెంచుకునేందుకు జనవరి 13న ఇచ్చారు. ఐసీడీఎస్ అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఆ పాపను తీసుకవచ్చి నరేష్ దంపతులకు అప్పగించారు. చట్టవిరుద్ధంగా పిల్లలను ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ నేరమని, ఒకవేళ సంతానం లేని వాళ్లు శిశుమందిరాల ద్వారా చట్టబద్ధంగా పిల్లలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి సీడీపీవో సక్కుబాయి, ఐసీడీయస్ సూపర్‌వైజర్ మంజుల, మేరీ తదితరులు పాల్గొన్నారు.