నెల్లూరు

రాచకొండ ఎత్తిపోతలకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, మార్చి 20: యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు పరిధిలోని సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే రాచకొండ ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న రైతులకు, ఫ్లోరిన్ బాధితులకు కొంత ఊరటనిచ్చే విధంగా సర్వే పనులకు జోవోను విడుదల చేసింది. ఈపథకానికి రాచకొండ ఎత్తిపోతుల పథకంగా పేరు పెడుతూ మంగళవారం ప్రభుత్వం జీవో నెంబర్ 496తో పాటు 1.72కోట్లను విడుదల చేసింది. చర్లగూడెం ప్రాజెక్టు ఎడమకాలువ ద్వారా విడుదల చేసే నీటిని సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాం గ్రామ పరిధిలో ఈఎత్తిపోతల పథకాన్ని రూపొందించడానికి గత సంవత్సరం రిటైర్ట్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీర్ల బృందం, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అన్ని రాజకీయపార్టీల నాయకులు, ప్రజలు నీటిని మల్లించే తీరుతెన్నులను కాలినడకన తిరిగి పరిశీలించారు. ఈలిఫ్ట్‌తో మొల్కచెరువును నింపుతూ అక్కడి నుంచి రాచకొండ గుట్టల్లోని చెరువులను, మంచాల, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్ మండలాల్లోని అనేక చెరువులను కృష్ణానీటితో నింపడానికి సర్వే చేయనున్నారు. రాచకొండలో మరో ప్రధాన రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తాగునీరు, ఇతర ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు సర్వే పనులను చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఈపథకం అమలు చేస్తే రంగారెడ్డి జిల్లా, యాదాద్రిభువనగిరి, నల్లగొండ జిల్లాలోని 3లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే హైదరాబాద్‌కు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతుంది. ఈ ఎత్తిపోతల పథకం వల్ల రాచకొండ ప్రాంతంలో రాజుల కాలంనాడు తవ్వించిన వందలాది చెరువు, కుంటలు నీటితో నింపడం, తద్వారా భూగర్భజలాలు పెరిగి సాగునీటికి, ఫ్లోరిన్ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని, నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రాచకొండ పేరుపెట్టి సర్వే పనులకు జీవో, నిధులు విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డిలకు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొల్ల శివశంకర్, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.