నెల్లూరు

చిట్యాలకు నగర పంచాయతీ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛిట్యాల, మార్చి 20: పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి వేగవంతమవుతున్నందున మేజర్ గ్రామపంచాయతీలను నగర పంచాయతీలుగా చేసేందుకు ప్రభుత్వం యోచనలో ఉండగా చిట్యాల నగర పంచాయతీ కానున్నది. ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీలను నగర పంచాయతీలుగా చేసేందుకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం ఎంపిక చేస్తుండం జనాభా అటు-ఇటుగా ఉండటంతో పక్కనున్న కొద్దిపాటి జనాభా గల గ్రామాన్ని కలిపి నగర పంచాయతీలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే చిట్యాలను కూడా నగర పంచాయతీగా చేసేందుకు ప్రతిపాదనలను పంపించాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులు ఆదేశించగా ప్రతిపాదలను పంపించడం జరిగింది. జనాభా 15000లకు పైగా ఉంటేనే నగర పంచాయతీగా చేసేందుకు నిబంధనలుండటంతో చిట్యాల ప్రస్తుత జనాభా సుమారు 13752 ఉండగా సుమారు 1299మంది జనాభా ఉన్నటువంటి చిట్యాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివనేనిగూడెం గ్రామాన్ని కూడా చిట్యాలలో కలిపడంతో రెండు గ్రామాలు కలిపి 15871మంది జనాభా ఉండటంతో చిట్యాలను నగర పంచాయతీగా చేసేందుకు మార్గం అనువుగా ఉంటుంది. నగర పంచాయతీగా చేసేందుకు జిల్లా కలెక్టర్‌తో కలిసి ఉన్నతాధికారులు ఈనెల 16వ తేదీన వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించి చిట్యాల, శివనేనిగూడెం గ్రామాలకు సంబంధించిన జనాభాతో పాటు ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించిన వివరాలతొ కూడిన ప్రతిపాదనలను పంపించాలని మండల అధికారులను అదేశించడంతో ఇప్పటికే పూర్తి సమాచారంతో నగర పంచాయతీకి అవసరమైనటువంటి వివరాలను ప్రభుత్వానికి పంపించారు.
నగర పంచాయతీతో లాభం-నష్టం
చిట్యాల నగర పంచాయతీగా మారినట్లయితే ఎన్నో లాభాలుంటాయి. లాభాలతో పాటు కొంత నష్టం కూడా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 20కోట్లు మంజూరవుతాయి. అంతేకాకుండా అభివృద్ధిని బట్టీ సంబంధిత శాఖ మంత్రి నిధులను రూ. 20 కోట్ల నుండి 100కోట్ల వరకు మంజూరు చేయవచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు నేరుగా నగర పంచాయతీకే రానున్నాయి. సర్పంచ్‌కు బదులుగా నగర పంచాయతీ చైర్మన్‌గా ఎన్నికవుతారు. పంచాయతీ కార్యదర్శికి బదులుగా నగర పంచాయతీగా మారడంతో కమీషనర్ స్థాయి అధికారులు పరిపాలనా విధులను నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా నగర పంచాయతీగా మారినట్లయితే గ్రామీణ ప్రాంతం నుండి పట్టణంగా మారుతున్నందున మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధిహామీ పథకం మండల పరిధిలో తొలగించి జాబ్‌కార్డులు కలిగి ఉన్నవారికి పనులను నిలిపివేయనున్నారు. ప్రస్తుతమున్న ఇంటి, ఆస్తి పన్నులు పెంచబడతాయి.