నల్గొండ

పారదర్శకంగా గ్రామీణాభివృద్ధి పథకాలు సాగాలి : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 3: గ్రామీణాభివృద్ధి పథకాలను పారదర్శకంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో గ్రామీణాభివృద్ధి పథకాల పురోగతిని, ఐకెపి సంఘాలు, సమభావన సంఘాల నిర్వాహణ, పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు అనర్హుల ఆసరా పింఛన్ల తొలగింపుతో పాటు అర్హులకు మంజూరు చేయాలని, చనిపోయిన వారి పింఛన్లు ఎవరైన తీసుకోకుండా పరిశీలించాలన్నారు. తెలంగాణ పల్లె ప్రగతి మండలాల్లో మార్కెటింగ్ సదుపాయలు విస్తరించాలని, కూరగాయలు, పప్పు ధాన్యాల సాగతు పెంచాలని, రైతులతో ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. వికలాంగులకు సదరన్ క్యాంపులు ఏర్పాటు చేసి సర్ట్ఫికెట్ల జారీలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులింకేజీ రుణాలు సకాలంలో అందించాలని, రివకరి సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. మండల సమాఖ్యల వద్ధ నిధులు, చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ సమీక్షించారు.