నల్గొండ

కార్యకర్తల కృషితోనే ఏఐసీసీ పదవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, మార్చి 21: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగానే తనకు ఏఐసీసీ పదవి లభించిందని డీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ భవనంలో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు తనకు ఎల్లప్పుడూ అండగా ఉండి పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేసిన ఫలితంగానే జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కార్యకర్తలను కొనియాడారు. జీవితాంతం కార్యకర్తలకు అండగా ఉంటానని, వారి సంక్షేమం కోసం పని చేస్తానని తెలిపారు. టీఆర్‌యస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం చెందిందని, కేవలం ప్రచార ఆర్భాటాలతోనే కాలం వెళ్లదీస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీ ఆర్‌యస్ ప్రభుత్వం వల్ల నష్టపోయిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నూతనంగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొల్పుల హరినాథ్, దశరథ, జనగాం ఉపేందర్‌రెడ్డి, జూకంటి రవి, జైనుద్దీన్, మల్లేశం, శ్రీకాంత్, పద్మ వెంకటస్వామి, ఎజాజ్, శ్రీకాంత్, శివమల్లు, రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ సభ్యుడికి ఘన సన్మానం
చింతపల్లి, మార్చి 21: కాంగ్రెస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్‌లాల్ నాయక్ ఏఐసీసీ సభ్యుడిగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మండలంలోని తీదేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. జగన్‌లాల్ నాయక్ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రావు వెంకటనర్సింహారావు, బుచ్చిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, అంజయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులకు అందుబాటులో న్యాయ సేవలు
చౌటుప్పల్, మార్చి 21: వృద్ధులకు అందుబాటులో న్యాయసేవలు ఉన్నాయని జిల్లా సివిల్ జడ్జీ కె.ప్రభాకర్‌రావు అన్నారు. చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం గ్రామంలో హెచ్‌ఎస్‌బీసీ, హెల్పేజ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గమన్ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా వృద్ధుల గ్రామైఖ్య సంఘం రెండవ ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ వృద్ధులకు ఉచితంగా వైద్య, న్యాయ సేవలు అందుతాయన్నారు. వృద్ధులను ఐకమత్యం చేయడానికి ఇదో మంచి వేదిక అన్నారు. బోరెం నిర్మల, బూర్గు కృష్ణారెడ్డి, బక్క శంకరయ్య, రజామహ్మద్, యెతేంద్రయాదవ్, మధు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతకు అన్యాయం

భూదాన్‌పోచంపల్లి, మార్చి 21: చేనేత రంగం పట్ల టీఆర్‌యస్ ప్రభుత్వం చిన్నచూపు చూడటాన్ని నిరసిస్తూ ఈ నెల 23న భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించే ఒక్క రోజు రిలే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర చేనేత జనసమాఖ్య ప్రధాన కార్యదర్శి చింతకింది రమేష్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో రిలే నిరాహార దీక్ష కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చేనేతకు 1200 కోట్లు కేటాయించగా, 373 కోట్లు అంకెల గారడీతో చూపించి కేవలం 5కోట్లు నామమాత్రంగా ఖర్చు పెట్టారని విమర్శించారు. నిధులు ఖర్చు పెట్టనప్పుడు బడ్జెట్‌లో కేటాయించడం ఎందుకని ప్రశ్నించారు. పోచంపల్లిలో శాశ్వత చీరెల కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయాలని, సిల్క్ నూలు డిపో ఏర్పాటుచేసి జియో ట్యాగ్ కలిగిన నేత కుటుంబాలకు 4కిలోల సిల్క్‌ను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నేత కార్మికులకు ముద్ర పథకం కింద రుణ సౌకర్యం అందించాలని కోరారు. అర్హులైన చేనేత కార్మికులందరికీ జియో ట్యాగ్ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, 20 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో చేనేత పరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి కర్నాటి పురుషోత్తం, సహాయ కార్యదర్శి జోగు శ్రీనివాస్, కార్మిక సంఘం డైరెక్టర్లు ఎర్వ నీలమ్మ, గోశిక అన్నపూర్ణ, వడ్డెపల్లి విష్ణు, వేముల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.