నల్గొండ

మాటల ప్రభుత్వాలకు కాలం చెల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 21: గత ఎన్నికల్లో ఆఛరణ సాధ్యంకాని జనాకర్షక హామీలతో మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని నరేంద్రమోదీ, రాష్ట్రంలోని సీఎం కెసిఆర్ ప్రభుత్వాలకు కాలం చెల్లిందని వచ్చే ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలు గద్దె దిగడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతు సీఎం కెసిఆర్ మరోసారి మాయమాటలు, గారడి లెక్కలే వినిపించారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై ప్రజలకు శే్వత పత్రం విడుదల చేసి తమ నిజాయితీని చాటుకోవాలన్నారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తున్న తీరు అప్రజాస్వామికమన్నారు. 1లక్ష 49వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో నల్లగొండ జిల్లా శ్రీశైలం సొరంగం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కేటాయించలేదన్నారు. ప్రాజెక్టుల భూనిర్వాసితులకు పరిహారం ఊసు లేదన్నారు. ఉపాధి, నిరుద్యోగ సమస్యల సాధనకు నిర్ధిష్ట చర్యలు ప్రతిపాదించలేదన్నారు. ఎంబిసిలకు వేయికోట్లు గత బడ్జెట్‌లో కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. నాలుగేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో నాలుగువేల మంది రైతు ఆత్మహత్యలు జరిగిన పట్టించుకోని సీఎం కెసిఆర్ ఎన్నికల ఏడాది పంట పెట్టుబడి సాయంతో రైతులను మభ్యపెడుతున్నారన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా తలెత్తిన గొడవలో మూకుమ్మడి సస్పెన్షన్‌లు అర్ధరహితమని ప్రభుత్వం భేషజాలకు పోకుండా సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ప్రజల్లో భ్రమలు తొలగిపోతున్నాయని, బిజెపి సిట్టింగ్ సీట్లలో ఓటములు, ఎన్‌డిఏలోని భాగస్వామ్య పార్టీలు ఒక్కోక్కటి బయటకు వెలుతుండటం అందుకు నిదర్శమన్నారు. కెసిఆర్ థర్డ్‌ఫ్రంట్‌పై విశ్వసనీయతలేదని ప్రాంతీయ పార్టీలన్ని తమ స్థానిక రాజకీయ ప్రయోజనాల ప్రాతిపాదికన పనిచేస్తు విశాల దృక్పథంతో ఆలోచించడంలేదన్నారు. గతంలో వామపక్షాలతో ఎన్నికల్లో పోటీ చేసిన ప్రాంతీయ పార్టీలు ఫలితాలు రాకముందే బిజెపితో వెళ్లాయన్నారు. దేశంలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష, ప్రజాస్వామిక, సామాజిక శక్తులను సంఘటితం చేసే దిశగా సిపిఎం చొరవ తీసుకుంటుందని, రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తులు ఉండబోవన్నారు. నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు ఎస్‌ఎల్‌బిసి, డిండి ఎత్తిపోతల, నక్కలగండి, ఉదయ సముద్రం ప్రాజెక్టులతో పాటు మూసీ కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం నిధులు అందించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. సిపిఎం అఖిల భారత మహాసభల బస్సుయాత్ర ఈ నెల 25న చిట్యాల, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో సాగనుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు మామిడి సర్వయ్య, డి.మల్లేశం, నారి ఐలయ్య, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, కె.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.