నల్గొండ

మిర్యాలగూడ ఎంఈఓ చంప్లానాయక్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మార్చి 21: మిర్యాలగూడ, దామరచర్ల, అడవీదేవులపల్లి మండలాలకు ఒకరే మండల విద్యాధికారిగా ఉన్న చంప్లానాయక్‌ను, ఉట్లపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుమతిని సస్పెండ్ చేస్తూ ఈ నెల 20 సాయంత్రం జిల్లా విద్యాశాఖాధికారి సరోజినిదేవి ఆదేశాలు జారీ చేశారు. మిర్యాలగూడ ఏంఈఓ కే.చంప్లానాయక్, టీచర్ సుమతిలపై ఏస్‌ఏఫ్‌ఐ, టీఎస్‌యుటీఎఫ్, ఉట్లపల్లి గ్రామానికి చెందిన లింగయ్య అనే వ్యక్తి ముడుపులు తీసుకుని హాజరుకాని ఉపాధ్యాయులకు హాజరు ఇచ్చి వేతనాలు ఇస్తున్నారని, మధ్యాహ్న భోజన బిల్లులు ముడుపులు తీసుకుని మంజూరు చేస్తున్నారని, అక్రమంగా డిప్యూటేషన్‌లు ఇస్తున్నారన్న ఫిర్యాదులు చేయడం జరిగింది. అంతే కాక ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ విచారణాధికారిగా డైట్ ప్రిన్సిపల్ సత్యనారాయణ నియమించారు. విచారణ అధికారి ఈ నెల 19న ఏంఈఓ కార్యాలయం ఎమ్మార్సీ భవనంలో రికార్డలను పరిశీలించారు, ఎంఈఓను కూడా విచారణ జరిపారు. చంప్లానాయక్, టీచర్ సుమతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అధికారి నివేదికను ఆధారంగా సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన కాలం అసలు పోస్టు అయిన మిర్యాలగూడ మండలం బీ.అన్నారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోనే ఉండాలని, అనుమతి లేనిదే హెడ్ క్వార్టర్ వీడవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. మిర్యాలగూడ ఎంఈఓగా బాధ్యతలను త్రిపురారం ఎంఈఓ బాలాజీనాయక్‌కు అప్పగించారు.

యాదాద్రిలో భక్తి పారవశ్యం
యాదగిరిగుట్ట, మార్చి 21: యాదాద్రి లక్ష్మినరసింహాస్వామి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్ధీ సాధారణ స్థాయిలో కొనసాగింది. స్వామి వారి దర్శనాలు, నిత్య కల్యాణోత్సవాలు, పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. ఐపిఎస్ సౌమ్యా మిశ్రా లక్ష్మినరసింహుడిని దర్శించుకోగా ఆలయ ప్రధానార్చాకులు నంధీగల్ లక్ష్మినరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు ఆమెకు ఆశీర్వఛనాలు, తీర్ధప్రసాదాలు అందించారు. స్వామివారి రోజువారి ఆదాయం 6లక్షల 18వేల 707రూపాయలుగా వచ్చినట్లుగా ఈవో గీత తెలిపారు.