నల్గొండ

అన్నదాతకు అండ నిలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మార్చి 21: నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం అన్నదాతలకు అండగా ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సూచించారు. నూతనంగా మార్కెట్ చైర్మన్‌గా నియామకమైన బొడ్డు రేవతిశ్రీనివాస్‌రెడ్డి తన పాలకవర్గం సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు. ఫలపుష్పాలను అందించి కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. అందులో భాగంగానే రైతుల రుణాలను మాఫీ చేసిందన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ను అందిస్తుందని గుర్తుచేశారు. సాగుకు పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత మార్కెట్ పాలకవర్గం, టీఆర్‌ఎస్ క్యాడర్‌పై ఉందన్నారు. పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉంటూ పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందించేందుకు కృషి చేయాలన్నారు. మధ్య దళారీల వద్దకు రైతులు వెళ్లి మోసపోకుండా చైతన్యవంతులను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు చింతల దామోదర్‌రెడ్డి, మండల కన్వీనర్ కొత్త పర్వతాలు, నందగిరి మహేశ్వరిశ్యాం, ఎం.దయాకరాచారి, సుర్కంటి నిర్మల, తిరందాసు ధనుంజయ్య, ఎం.డి.ఖలీల్, ఎం.డి.బాబాషరీఫ్, ముత్యాల భూపాల్‌రెడ్డి, పాక పద్మచిరంజీవి, ఊడుగు జ్యోతిరమేష్, ఆరుట్ల శంకర్, ముప్పిడి శ్రీనివాస్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, బద్దం పాండురెడ్డి, రహీం, తడక కిరణ్, ఇబ్రహీం, దుబ్బాక శశిధర్‌రెడ్డి, బొడ్డు నిర్మల, శ్రీనివాస్‌రెడ్డి, భూపాల్‌చారి, ప్రతాపరెడ్డి, ఢిల్లీ శంకర్‌రెడ్డి, మధుసూదన్ తదితరులు ఉన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మోత్కూర్, మార్చి 21: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మోత్కూర్ పరిధిలోని కొండాపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపురం గ్రామానికి చెందిన రైతు బి.కృష్ణయ్య (60)కు మూడెకరాల నిమ్మ తోట, ఐదెకరాల సాగుభూమి ఉన్నట్లు తెలిపారు. సాగునీటి కోసం ఐదు బోర్లు, మూడు బావులు తీసినప్పటికీ నీళ్లు పడకపోవడం, పంట సాగు, బోర్లకు తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపం చెంది ఈ నెల 17న గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.