నల్గొండ

రాచకొండ అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, మార్చి 22: రాచకొండను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చనున్నట్లు రాచకొండ కమిషనరేట్ కమీషనర్ మహేశ్ ఎం భగవత్ అన్నారు. మండలంలోని రాచకొండ గ్రామపంచాయతీ ఐదుదోనలతండా నుంచి కడీలబావితండా వరకు 5లక్షల పోలీస్ నిధులతో నిర్మించే 6కిలోమీటర్ల మట్టిరోడ్డు పనులను గురువారం మహేశ్ భగవత్ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాచకొండలోని గిరిజనులకు ప్రభుత్వ ఫలాలు అందించడం కొరకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. తాను దత్తత తీసుకున్న రాచకొండను అభివృద్ధి చేయడం కోసమే పోలీస్‌శాఖ నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఈమట్టిరోడ్డును వారం రోజుల్లో పూర్తి చేసి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. ఆదే విధంగా గిరిజనులు బాల్య వివాహాలు, మూడనమ్మకాలు, నాటుసారా తయారీ వంటి వాటి నుంచి బయటపడాలన్నారు. అందివస్తున్న సాంకేతికతను ఉపయోగించుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నారు. తండాలో బోరు కావాలని గిరిజనులు కోరగా బోరును వేయించి, ఫిల్టర్ ప్లాంటును ఏర్పాటు చేయిస్తామని హామీనిచ్చారు.
మినీ అంగన్‌వాడీ కేంద్రం కావాలని కోరగా ఏర్పాటు చేయిస్తామని వివరించారు. అనంతరం ఎంవీ ఫౌండేషన్ వారు సమకూర్చిన నోట్ బుక్కులను విద్యార్థులకు అందజేశారు. త్వరలోనే 18వేల పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రకటన చేయనున్నదన్నారు. ఇప్పటికే పోలీసు ఉద్యోగాలకోసం ఉచిత శిక్షణ తీసుకున్న వారు పరీక్షలకోసం మరింత శిక్షణ పొందాలన్నారు.

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
ఏఐసీసీ సభ్యుడు బూడిద, సర్వోత్తమరెడ్డి
ఆత్మకూర్(యం), మార్చి 22: వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపడుతుందని ఏఐసీసీ సభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్, రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంఎస్‌ఆర్ గార్డెన్‌లో ఏఐసీసీ సభ్యులుగా నియమితులైన బూడిద బిక్షమయ్యగౌడ్, రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపుతో పాటు పదవులు వస్తాయన్నారు. కార్యకర్తలే అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి చైతన్యపర్చాలని వారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను అమలుచేయడంలో టీఆర్‌యస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు.

1నుంచి ధాన్యం కొనుగోలు
జేసీ నారాయణరెడ్డి వెల్లడి
రామగిరి, మార్చి 22: నల్లగొండ జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారులు, పీపీసీ ఇన్‌చార్జిలు, ట్యాబ్ ఆపరేటర్లకు గురువారం జిల్లా కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు జిల్లా సంయుక్త కలెక్టర్ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రబీ 2017-18 సీజన్‌కు సంబంధించి ఏప్రిల్ 1 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఐకేపీయే కాకుండా 39 పీఏసీయస్‌లు, ఒకటి డీసీఎంఎస్‌ల ద్వారా మొత్తం 70 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రబీలో ఈ కేంద్రాల ద్వారా 2లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఏర్పాటుచేసుకున్నట్లు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, తేమ యంత్రాలు, గోనె సంచులు, టార్పాలిన్లను సమకూరుస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో షెడ్లు, మంచి నీటి వసతి, కరెంట్ వసతి, తాత్కాలిక మరుగుదొడ్లను సమకూర్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ మద్దతు ధరను రైతులకు సకాలంలో అందించేలా చూడాలని అధికారులకు సూచించారు.