నల్గొండ

టీఆర్‌ఎస్ ఉనికి కోసమే ఉపఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, మార్చి 22: రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరించి కాంగ్రెస్ శాసన సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసిందని కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంభం కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలంగా లేని స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించి ఉనికిని చాటుకునే ప్రయత్నాలను టీఆర్‌యస్ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం పోరాడుతున్న విద్యార్థులను మరొక వైపు, రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను ఇంకోవైపు అణచివేస్తూ జైళ్ల పాలు చేయడం బాధాకరమన్నారు. కేసీఆర్ మరోసారి మాయల మరాఠి అవతారమెత్తారని, ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకే కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేస్తామని మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మూడో దశ నిర్వహించే బస్సు యాత్ర వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఉండబోతుందన్నారు.

ఓటమి భయంతో సీఎం కక్ష సాధింపు
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, మార్చి 22: రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతోనే సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగడుతూ ప్రజల మధ్యకు వెలుతున్నందునే కోమటిరెడ్డిపై కక్ష సాదిస్తున్నారని విమర్శించారు. సభలో ప్రతిపక్ష పార్టీ లేకుండా ప్రభుత్వం నియంతలాగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఇటీవల నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళన తూత మంత్రంగా నిర్వహించారని ఆరోపించారు. 1-బి సక్రమంగా నమోదు చేయలేదని, 1-బిలో జరిగిన తప్పులను వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు.

యాదాద్రిలో భక్తుల సందడి
ఆలయ బంగారు, వెండి నిల్వల పరిశీలన
యాదగిరిగుట్ట, మార్చి 22: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. నిత్య పూజలు, నిత్య కల్యాణోత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఒక రోజు ఆదాయం 6లక్షల 19,707రూపాయలుగా వచ్చింది. కాగా ఆలయ పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా ధ్వజస్తంభం, దివ్య విమాన గోపురం బంగారు తాపడం చేసేందుకు ప్రభుత్వ మింట్ కంపౌండ్‌లో కరిగించేందుకు దేవాదాయ శాఖ ప్రతినిధుల సమక్షంలో ఆలయంలో నిరుపయోగంగా ఉన్న బంగారం, వెండిని పరిశీలించారు. 10కిలోల 639గ్రాముల 700మిల్లి గ్రాముల బంగారుం మింట్‌కు పంపించాలని నిర్ణయించారు. ఈ నెల 29న వెండి నిల్వల పరిశీలన చేయనున్నారు.