నల్గొండ

ప్రజాధనం దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, మార్చి 22 : ముఖ్యమంత్రి కెసిఆర్ విలాసవంతమైన జీవనం గడుపుతూ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కలకత్తాకు ప్రత్యేక హెలికాప్టర్ తీసుకెళ్లి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని స్థానిక ఎంయల్‌ఏ, టిపిసిసి చీప్ యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం హుజూర్‌నగర్‌లో మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలు చేయటానికి వీలుకాని హమీలు ఇచ్చి శాసనసభలో ప్రతిపక్షాలు నిలదీస్తాయనే అప్రజాస్వామికంగా కాంగ్రెసు సభ్యులను బడ్జెట్ సమావేశాల పూర్తి వరకు సస్పెండ్ చేశారని, ఇద్దరు సభ్యుల సభ్యత్వం రద్దు చేయించారని అన్నారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించవలసిన శాసనసభ స్పీకరణ అప్రజాస్వామికంగా వ్యవహరించి పదవికే మచ్చ తెచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల పొత్తుపై ఏఐసిసి మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెసు, టిడిపి చర్చలు నిజం కాదని ఊహగానాలని అన్నారు. టిఆర్‌యస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయని ఇదే చివరి బడ్జెట్ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల పట్ల, ప్రతిపక్షాల పట్ల అసహనం, అహంకారంగా వ్యవహరిస్తున్నారని త్వరలో ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని ఉత్తమ్ అన్నారు. 2014 ఎన్నికలలో టిఆర్‌యస్ పార్టీకి 33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని 67 శాతం ఉన్న ప్రతిపక్షాల గొంతు నొక్కటానికే గత 4 సంవత్సరాలుగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలపై, యంఆర్‌పియస్‌పై, కోదండరామ్‌పై, ప్రజలపై ఎదురుదాడులు చేస్తున్నారని ప్రజాస్వామ్య పాలన రాష్ట్రంలో సాగటం లేదని ఆయన అన్నారు. ఇలా ఉండగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం లబ్దిదారులకు చెక్‌లు అందచేశారు.

అంబేద్కర్, జగ్జీవన్ జయంతిలనుఘనంగా నిర్వహిస్తాం: కలెక్టర్
నల్లగొండ రూరల్, మార్చి 22: డాక్టర్ బీఆర్.అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్‌ల జయంతిలను ఘనంగా నిర్వహిస్తామని, ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ దళిత సంఘాల నాయకులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో బాబూ జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జయంతిలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకునే చర్యలపై సంఘం నాయకులు, అధికారులతో కలెక్టర్ చర్చించారు. సంఘాల నాయకులు అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తే తదనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తుందన్నారు. జిల్లా యంత్రాంగం అన్ని శాఖల్లో పథకాల అమలుతీరును పర్యవేక్షిస్తుందన్నారు. జిల్లాలో దళితులకు మూడెకరాల భూమికై బడ్జెట్, అంబేద్కర్ భవనానికి స్థల కేటాయింపు జరిగిందని, అన్నారెడ్డిగూడెంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరలో తనిఖీ చేస్తామన్నారు. దళితుల అభివృద్ధికి నిధులను ఖర్చు చేసి అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు.

రామిరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ
హుజూర్‌నగర్ బార్ అసోషియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను స్థానిక ఎంయల్‌ఏ, టిపిసిసి చీప్ యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం పరామర్శించారు. మండలంలోని అమరవరం గ్రామంలో రామిరెడ్డి మాతృమూర్తి సాముల మట్టమ్మ పెద కర్మ కార్యక్రమంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొని రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

చిత్తశుద్ధితో పనిచేద్దాం
గుత్తా అధ్యక్షతన రాష్ట్ర రైతు సమన్వయ సమితి తొలి భేటీలో నిర్ణయం
నల్లగొండ, మార్చి 22: తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి తొలి సమావేశం చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. గుత్తాతో పాటు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిట్లా పార్ధసారధి, రైతు సమితి మేనేజింగ్ డైరక్టర్ జగన్‌మోహన్, హర్టికల్చర్ డైరక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఆర్ధిక శాఖ సంయుక్త కార్యదర్శి వి.సాయిప్రసాద్, మార్కెటింగ్ డైరక్టర్ జి.లక్ష్మిభాయితో పాటు వివిధ జిల్లాల రైతు సమన్వయ సమితి కోఆర్టీనేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి ఏర్పాటు లక్ష్యాలు, విధులను జిల్లా కోఆర్టీనేటర్లకు వివరించారు. సీఎం కెసిఆర్ ఆశయం మేరకు రైతు సమన్వయ సమితిలు తమ విధుల్లో విజయవంతం అయ్యేందుకు చిత్తశుద్దితో కృషి చేయాలన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలవుతున్న ఎకరాకు పంటకు నాలుగువేల రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీ సజావుగా సాగేలా రైతు సమన్వయ సమితిలు సహకరించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, భూసార పరీక్షల, పంటల సాగు ఎంపిక, మద్ధతు ధర, రైతు వేదికల నిర్మాణం తదితర అంశాల్లో సమితిలు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.