నల్గొండ

క్షయ నిర్మూలనకు బాధ్యతగా కృషిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, మార్చి 24: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్మూలనపై శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,918 మంది క్షయ వ్యాధిగ్రస్తులున్నారని, వీరిలో 1750 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మిగతా వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వీరి కోసం 7 టీబీ సెంటర్లు, 18 డీయంసీలు, జిల్లాలోని 31 ఆరోగ్య కేంద్రాల్లో 22మంది సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ ర్యాలీ గడియారం సెంటర్ నుండి జిల్లా కేంద్ర ఆస్పత్రి వరకు కొనసాగింది. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ అరుంధతి, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ వసంతకుమారి మాట్లాడుతూ క్షయ వ్యాధి వయసు, లింగబేధంతో సంబంధం లేకుండా సోకుతుందని, దీనికి నివారణ ఒక్కటే మార్గమన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో అతి త్వరగా సంక్రమించే ప్రాణాంతక వ్యాధిగా గుర్తించి ప్రభుత్వం అందించే మందులను క్రమం తప్పకుండా వాడి తగ్గించుకోవాలన్నారు. ఈ వ్యాధి ఉన్న వారు దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా గాలిలో కలిసి ఇతరులు ఆ గాలి పీల్చినప్పుడు సోకుతుందని, తగు జాగ్రత్తలు పాటించి వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు.
గతంలో టీబీ నియంత్రణకు 2 సంవత్సరాలు మందులు వాడాల్సి వచ్చేదని, ప్రస్తుతం 9 నెలల్లో వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చన్నారు. ప్రజలను అవగాహన పర్చేందుకు కళాజాత ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో భానుప్రసాద్ నాయక్, వైద్యులు అనితారాణి, పుల్లారావు, గౌరీశ్రీ, రాజేశ్వరీ, హేమలత, లీలావతి, దీప, డ్రగ్ కంట్రోల్ అధికారి గోవింద్‌సింగ్, రాంమోహన్‌రావు, హర్ష, రవిప్రసాద్, సరుూద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలపై న్యాయవిచారణ చేపట్టాలి
* జేసీకి తెలంగాణ విద్యార్థి వేదిక వినతి
రామగిరి, మార్చి 24: శ్రీచైతన్య, నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల మృతిపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా కన్వీనర్ గోపినాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల కోసం విద్యార్థులను 16గంటలకు పైగా చదివించడంతో నిద్రలేక మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత అక్టోబర్, నవంబర్ మాసాల్లో 57 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకొని, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీవైఎఫ్ జిల్లా కన్వీనర్ సిరపంగి సంజీవ, వరుణ్, సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ రాజుకున్న గట్టుప్పల్ మండల రగడ..!
నల్లగొండ, మార్చి 24:మండలంగా ఏర్పాటు చేయాలంటు నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ గ్రామస్తులు చేపట్టిన ఆందోళన మరోసారి ఉదృతమైంది. సీఎం కెసిఆర్ పరకాలను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తు అక్కడ మరో కొత్త మండలాన్ని సైతం ఏర్పాటు చేస్తు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిన వెంటనే తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించడంలో మరోసారి తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని భావిస్తు గట్టుప్పల్ వాసులు శుక్రవారం రాత్రి నుండే నిరసనకు దిగారు. శనివారం గట్టుప్పల్ మండల సాధన కోసం గ్రామస్తులు చేపట్టిన ఆందోళన 529వ రోజుకు చేరుకోగా పరకాలకు ఒక న్యాయం, తమకొక న్యాయమా అంటు గట్టుప్పల్ వాసులు బంద్‌కు పిలుపునివ్వగా బంద్ ప్రశాంతంగా సాగింది.