క్రైమ్/లీగల్

వివాహిత అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 3: అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మృతిచెందిన సంఘటన మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చివ్వెంల మండలం గుంపుల గ్రామానికి చెందిన కొమ్ము కవిత (30) అనారోగ్యంతో ఉందని మంగళవారం తెల్లవారుజామున భర్త వెంకన్న ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మకూర్ ( ఎస్) మండలం పాతర్లపహడ్ గ్రామానికి చెందిన కవితను పనె్నండేళ్ల క్రితం గుంపుల గ్రామానికి చెందిన వెంకన్నకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకన్న తరుచూ భార్యతో గొడవపడుతూ కొడుతుండేవాడని ఈక్రమంలో సోమవారం రాత్రి భార్య కవితను తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పహ కోల్పోవడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు మృతురాలి బంధువుల ఆరోపించారు. వెంకన్న విచక్షణ రహితంగా కొట్టడంతోనే కవిత మృతిచెందిదని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బంధువులను వారించారు.

అప్పులు తీర్చే మార్గం లేదన్న ఆవేదనతో
నేత కార్మికుడి మృతి
భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్ 3: బతుకుదెరువు కోసం వలస వచ్చిన నేత కార్మికుడు అప్పుల బాధతో మనస్థాపం చెంది మృతి చెందిన సంఘటన భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. నకిరేకల్‌కు చెందిన జల్లా కిరణ్ (38) నేత కార్మికుడు గత 15 సంవత్సరాల క్రితం పోచంపల్లికి వలస వచ్చి మగ్గంపై ఆధారపడి జీవిస్తున్నాడు. మండల కేంద్రంలోని గుజ్జ యాదగిరి ఇంట్లో కిరాయికి ఉంటూ కూలీ మగ్గం నేస్తున్నాడు. ఇంటి ఖర్చుల నిమిత్తం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపం చెందుతుండగా.. మంగళవారం మధ్యాహ్నం కిరణ్‌కు ఛాతి నొప్పి రాగా చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లోకి మృతదేహాన్ని రానివ్వకపోవడంతో వారి బంధువులకు సంబంధించిన ఖాళీ స్థలంలో టెంటు వేసి మృతదేహాన్ని ఉంచారు. స్థానికుల సహకారంతో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.