క్రైమ్/లీగల్

అంతర్‌రాష్ట్ర నేరస్థుల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, ఏప్రిల్ 10: ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్ మసాలాలను అక్రమంగా తరలిస్తూ అమ్ముతున్న అంతర్ రాష్ట్ర నేరస్తుల ముఠాను మంగళవారం మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రంగనాథ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ పోలీసులు ఆలగడప టోల్‌గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడకు చెందిన కందుకూరి శ్రీనివాస్ తన కిరాణ షాపుకు సంబంధించిన సామాన్లతో పాటు గుట్కాలను తీసుకవస్తుండగా.. పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని విచారించగా హైద్రాబాద్ కాటేదాన్‌లో గల విసంశెట్టి సాం బశివడు, దొంతం రాజశేఖర్‌రెడ్డి నడిపిస్తున్న మా వైష్ణవి గోదాము, మదీనాలోని సంజయ్ భటియా, వసీం పత్నీ, మహ్మద్ జుబేర్ అహ్మద్‌లకు చెందిన బాటో గోదాముల్లో గుట్కా, పాన్ మసాలాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. గోదాములకు ఢిల్లీ, గుజరా త్ రాష్ట్రంలోని సూరత్ నుండి గుట్కా, పాన్ మసాలాల దిగుమతి జరుగుతున్నట్లు వివరించారు. ఢిల్లీకి చెందిన రంజన్ గుప్త అలియాస్ రాజుభాయ్, సూరత్‌కు చెందిన అశోక్‌లు వీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మిర్యాలగూడ పోలీసులు కం దుకూరి శ్రీనివాస్‌ను విచారించి హైద్రాబాద్ గోదాముల నిర్వాహకులైన సాం బశివడు, రాజశేఖర్‌రెడ్డి, భటియా, వసీం, జుబేర్‌లను అదుపులోకి తీసుకొని వారి గోదాముల్లో గల 54 లక్షల 67 వేల 800 రూపాయల విలువ చేసే గేమ్ గుట్కా, బడా మిరాజ్, ఎం గోల్డ్, చోట మిరాజ్ కాటన్లు, ఎంసీ గుట్కా కాటన్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, సూరత్‌లకు చెందిన రంజన్, అశోక్‌లు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన మిర్యాలగూ డ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐలు సైదాబాబు, విజయ్‌కుమార్, హెచ్‌సీ రమణారెడ్డి, పీసీలు రబ్బాని, భాస్కర్, ముత్తులింగం, లింగరాజులను ఎస్పీ అభినందించారు.