నల్గొండ

ధాన్యానికి బోనస్ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాయనా..ఏడాది ఓపికపట్టు.. సాగునీటినందిస్తా ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి
చిట్యాల, ఏప్రిల్ 19: వ్యవసాయ సాగు కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పంటలకు పెట్టుబడినిస్తుంది సరే..అసలు ధాన్యానికి బోనస్‌ను ఇచ్చినట్లయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శివనేనిగూడెం రోడ్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామంటూ ప్రభుత్వం ప్రచారార్భాటం చేస్తుందే తప్ప చేసిందేమిలేదని రైతుల పండించిన ధాన్యానికి కనీస మద్ధతు ధర కూడా అందించడంలో ప్రభుత్వం విఫలం చెందినదని విమర్శించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించినట్లయితే పెట్టుబడి కూడా రావడంలేదని అందుకు కారణం ధాన్యానికి కనీస మద్ధతు ధర లేకపోవడమేనని ప్రభుత్వం రైతు ప్రభుత్వమంటూ చెప్పడం పక్కన పెట్టి మద్ధతు ధరను పెంపుపై దృష్టిని సారించకుండా రైతులను మోసగిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో మద్ధతు ధరను ఆయా ప్రభుత్వాలు పెంచాయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్ధతు ధరను పెంచడంలేదన్నారు. రైతులకు పంటల పెట్టుబడినిస్తామంటున్న ప్రభుత్వం ముందు ధాన్యానికి క్వింటాలుకు రూ. 200లకు పైగా బోనస్‌ను అందించినట్లయితే పెట్టుబడిని మించి ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం మాత్రం పెట్టుబడినిచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగ సమస్యలను విస్మరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేస్తున్నామంటున్నారే తప్ప ఆచరణలో చేసిందేమిలేదని విమర్శించారు. ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలను కల్పించడంలేదని ఎండలు విపరీతంగా మండిపోతున్నా నీడ కోసం ఏర్పాట్లను చేయలేదన్నారు. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువ నీటిని కాంగ్రెస్ ప్రభుత్వంలో విడుదల చేసి రైతాంగానికి సాగునీటినందించామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా నీటిని విడుదల చేయలేదన్నారు. కాలువ వెడల్పు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప చేసిందేమిలేదని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ వెళ్ళిపోతున్న సమయంలో రైతులు ఆయన్ను చుట్టుముట్టీ అప్పడు నీళ్ళిచ్చారని ఇప్పుడు పంటకు నీళ్ళు కరువైనాయని ఇబ్బంది ఉన్నదని రైతులు ఎమ్మెల్సీతో చెప్పుకున్నారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మీకు ఇక నీళ్ళివ్వదని పెద్దాయనా..ఒక్క ఏడాది ఓపిక పట్టు మన ప్రభుత్వం వస్తది వ్యవసాయానికి సాగునీటినందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నార్కట్‌పల్లి జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, పెద్దకాపర్తి సర్పంచ్ కందిమళ్ళ శిశుపాల్‌రెడ్డి, చిట్యాల మాజీ సర్పంచ్ జడల ఆదిమల్లయ్య, నాయకులు పోకల దేవదాసు, సాగర్ల గోవర్ధన్, బొబ్బలి శివశంకర్‌రెడ్డి, రెముడాల యాదయ్య, జిట్ట రాజయ్య, జిట్ట చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డున పడ్డ టమోట
* ధర లేక రైతుల విలవిల
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 19: టమోట ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమోట ధర క్వింటాకు రూ.400 కూడా రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం కూలీ డబ్బులు, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో దిక్కు తోచని స్ధితిలో కష్టపడి పండించిన టమోటాను రోడ్డు పక్కన, తోట సమీపంలో పడవేస్తున్న ధీన స్థితి దాపురిస్తుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.