నల్గొండ

ప్రజాబలం ఉంటే ఎన్నికల్లో తలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 20: హైకోర్టు తీర్పుతో ఉప ఎన్నిక తప్పిందన్న ఆనందంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇష్టారాజ్యంగా సీఎం కెసిఆర్‌ను విమర్శిస్తున్న తీరు ఆయన మానసిక బలహీనతను చాటుతుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డిలు విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టిఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరులో సమావేశంలో బండ మాట్లాడుతు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నిజంగా ప్రజాబలముంటే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో తలపడాలని సవాల్ విసిరారు. కెసిఆర్‌ను విమర్శించడం ద్వారా తానొక పెద్ద నాయకుడినన్న భ్రమలో కోమటిరెడ్డి ఉన్నారన్నారు. సీఎం కెసిఆర్‌కు కోమటిరెడ్డిని చంపించేంత అవసరం, తీరక లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కుమ్ములాటల్లో తన ఉనికిని కాపాడుకునే క్రమంలో టిఆర్‌ఎస్ పాలనపై విమర్శలు చేయడమే కోమటిరెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు. ఒకసారి కెసిఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేసి డిపాజిట్ రాకుండా చేస్తానంటు, మరోసారి సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తానంటు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న తీరు కోమటిరెడ్డి మతిభ్రమణను చాటుతుందన్నారు. హైకోర్టులో సాంకేతికంగా గెలిచిన కోమటిరెడ్డి చేసిన హడావుడితో ఆయన నైతికంగా ఓడిపోయినట్లుగా తేలిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో కాంట్రాక్టు పనుల అవినీతితో ఎదిగిన కోమటిరెడ్డికి టిఆర్‌ఎస్ చేస్తున్న ప్రాజెక్టుల్లోనూ అవినీతి కనిపిస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో బొడ్రాయి ప్రతిష్టాపనోత్సవం జరుగుతుండటంతో పోలీసుల అనుమతి లేకున్న కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించి పట్టణంలో అలజడి రేపేందుకు కోమటిరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేశారన్నారు. భూపాల్‌రెడ్డి మాట్లాడుతు కోమటిరెడ్డికి నిజంగా ప్రజాబలముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి రావాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు కోమటిరెడ్డిని గెలిపించి పశ్చాత్తాపం చెందుతున్నారని ఈ దఫా ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమన్నారు. నియోజకవర్గానికి పట్టిన కోమటిరెడ్డి అనే శనిని రానున్న ఎన్నికల్లో తరిమేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మహిళా కోఆర్డీనేటర్ మాలే శరణ్యారెడ్డి, మార్కెట్ చైర్మన్ కరీంపాషా ఉన్నారు.

సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలి
చౌటుప్పల్, ఏప్రిల్ 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దగాకోరు విధానాలు, ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని రాజీవ్ స్మారక భవన్‌లో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడుగా మహంకాళి మైసయ్యను నియామకం చేస్తూ జారీ చేసిన నియామక పత్రాన్ని ఆమె అందజేశారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా స్రవంతిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. లందగిరి భీమయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పాశం సంజయ్‌బాబు, బ్లాక్ అధ్యక్షుడు గుండు మల్లయ్యగౌడ్, మండల కమిటీ అధ్యక్షుడు చింతల వెంకట్‌రెడ్డి, నాయకులు ఉబ్బు వెంకటయ్య, మొగుదాల రమేష్, కొండ యాదగిరి, నల్ల నరేందర్‌రెడ్డి, దోర్నాల సత్తిబాబు, బయ్య సాయికుమార్, ఎం.డి.గౌస్‌ఖాన్, రాజేష్‌ఖన్నా, ఫృద్వీ, కార్తీక్, శివకుమార్, సూర్యనారాయణ పాల్గొన్నారు.