నల్గొండ

లక్ష్మీ నృసింహ నిత్య కల్యాణం ఆండాళ్‌కు ఊంజల్ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 20: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో శుక్రవారం నిత్యారాధనలు, ఆర్జిత సేవలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొపి నిత్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిష్టామూర్తులకు ఆరాధన నిర్వహించిన పూజారులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పాలతో అభిషేకం జరిపి తులసీ దళాలతో, పూలమాలలతో సుందరంగా అలంకరించారు. కవచ మూర్తులను స్వర్ణ పుష్పాలతో అర్చించి ఆరాధించారు. మహా మండపంలో వేద మంత్రాలతో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన అష్టోత్తరం, సహస్త్ర నామార్చనలు, కల్యాణ మహోత్సవం, వెండిజోడి సేవోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.
ఆండాళమ్మకు ఊంజల్ సేవ
శుక్రవారం విశిష్టతమైన రోజున ఆండాళమ్మ అమ్మవారిని కొలుస్తూ ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో అమ్మవారిని ఆరాధిస్తూ కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలతో తీర్చిదిద్దారు. అలంకరించిన ముత్యాల పల్లకిపై అమ్మవారిని అధిష్టింప చేసి ఊంజల్ సేవ నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన సేవోత్సవం, కుంకుమార్చనలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజారులు అమ్మవారికి హారతి నివేదన జరిపారు.

రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం: ఎంపీ గుత్తా
రామగిరి, ఏప్రిల్ 20: రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై(మిగతా 3వ పేజీలో) మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, గుండ్లపల్లి సర్పంచ్ పనస శంకర్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అనె్నపర్తిలో హరితహారం మొక్కలను పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక బృందం
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 20: నల్లగొండ మండలం అనె్నపర్తి గ్రామ పరిధిలో నాటిన హరితహారం మొక్కలను శుక్రవారం రాష్ట్ర ప్రత్యేక బృందం సభ్యులు అధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా రెండు సంవత్సరాల నుండి అద్దంకి- నార్కట్‌పల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా, 12వ బెటాలియన్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో, అనె్నపర్తి గ్రామంలో నాటిన మొక్కలు, సంరక్షణ విధానాలను హరితహారం రాష్ట్ర ప్రత్యేక బృందం సభ్యులు డాక్టర్ నర్సయ్య, పాల్ రాజ్‌కుమార్‌లు పరిశీలించారు. వారి వెంట డీఆర్‌డీఏ పీడీ ఆర్.అంజయ్య, డీఎఫ్‌వో శాంతారామ్, ఎఫ్‌డీవో సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ ఎంపీడీవో సత్తెమ్మ, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.