నల్గొండ

బహిష్కరణతో పెరిగిన బలం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 20: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో దూకుడుగా సీఎం కెసిఆర్‌పై విమర్శల దాడి సాగిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి తాజాగా శాసన సభ్యత్వ రద్ధు కేసులో సాధించిన విజయం రాజకీయంగా అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ మరింత క్రేజ్ అందించినట్లుగా ఆ పార్టీ క్యాడర్ భావిస్తుంది. కోమటిరెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి నల్లగొండ అసెంబ్లీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న టిఆర్‌ఎస్‌కు హైకోర్టు తీర్పు ఎదురుదెబ్బగా మారింది. కోర్టు తన శాసన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని తీర్పునిచ్చిన పిదప కోమటిరెడ్డి కెసిఆర్ ప్రభుత్వంపై తన విమర్శల దాడికి మరింత పదును పెడుతు ప్రజల్లోకి వెలుతున్నారు. సొంత నియోజకవర్గంలో భారీ ర్యాలీతో హంగామా చేసి సీఎం కెసిఆర్ ప్రభుత్వ పతనమే తన లక్ష్యమంటు అందుకు అధిష్టానం అనుమతిస్తే తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానంటు కోమటిరెడ్డి ప్రకటించి పార్టీ క్యాడర్‌లో కదనోత్సహం రగిలించారు. బస్సుయాత్ర కంటే పాదయాత్ర పార్టీకి మరింత మైలేజ్ తేస్తుందని అందుకు తాను సిద్ధంగా ఉన్నానంటు కోమటిరెడ్డి అధిష్టానంకు వివరించినట్లుగా తెలుస్తుంది. శుక్రవారం తన ఢిల్లీ పర్యటనలో పిసిసి చీఫ్ ఉత్తమ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి కుంతీయాతో పాటు రాహుల్‌ను కలిసిన కోమటిరెడ్డి పార్టీ అధిష్టానంలో తన ప్రాబల్యాన్ని పట్టును పెంచుకునే దిశగా పావులు కదిపారు. శాసన సభ్యత్వ రద్ధుపై కోమటిరెడ్డి హైకోర్టు వేదికగా సాగించిన న్యాయపోరాటాన్ని రాహుల్ అభినందించడం కోమటిరెడ్డి వర్గీయుల్లో కొత్త జోష్‌ను నింపింది. ముఖ్యంగా రాహుల్‌తో ఏకాంతంగా భేటీయైన కోమటిరెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌లో తనకు మరింత స్వేచ్ఛ, అవకాశాలిచ్చినట్లయితే పార్టీని అధికారంలో తీసుకరావడంలో మరింత క్రీయాశీలక భూమిక పోషిస్తానంటు రాహుల్‌తో చెప్పినట్లుగా కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. గతంలో తనకు పిసిసి పగ్గాలిస్తే రాష్టమ్రంతా పాదయాత్ర చేసి పార్టీ అభ్యర్ధులందరిని గెలిపించుకునేందుకు ఆర్ధికంగా, రాజకీయంగా కృషిచేస్తానంటు చెప్పిన కోమటిరెడ్డికి అధిష్టానం వద్ధ తన వాదన వినిపించేందుకు సరైన్ అవకాశాలు దక్కలేదు. అయితే తన శాసన సభ్యత్వ రద్ధు వివాదం పుణ్యమా అని పార్టీ ఢిల్లీ పెద్దల్లో పట్టుపెంచుకునే మార్గాలు కోమటిరెడ్డికి లభించాయి. ఇదే అదనుగా రాహుల్‌తో భేటీ సందర్భంలో తన రాజకీయ ఎజెండాను కోమటిరెడ్డి రాహుల్ ముందుంచినట్లుగా తెలుస్తుంది. తన ప్రథమ లక్ష్యం కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమేనని, అందుకు పార్టీలో సీనియర్లందరితో కలిసి సాగుతానని, పార్టీ పరంగా తన పాదయాత్రకు అనుమతినివ్వాలంటు కోమటిరెడ్డి రాహుల్‌కు నివేదించారని సమాచారం. పాదయాత్ర లక్ష్యం పార్టీ అధికారంలోకి రావడమేనని పార్టీలోని ఇతర నాయకులకు పోటీగానో, ఎన్నికల పిదప పదవీ కోసమే కాదంటు రాహుల్‌కు విన్నవించారు. బస్సుయాత్రలో పాల్గొనేందుకు తాను రాష్ట్రానికి వస్తానని, ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన కార్యాఛరణపై మార్గదర్శకం చేస్తామంటు రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా కోమటిరెడ్డి వర్గీయులు భోగట్టా. ఏది ఏమైనా శాసన సభ్యత్వ రద్ధు వివాదం కోమటిరెడ్డికి కొంతకాలం కోర్టు కేసుల పరంగా టెన్షన్ మిగిలించినా ఈ పరిణామాలను రాజకీయంగా తనకు సానుకూలంగా మలుచుకోవడంలో కోమటిరెడ్డి విజయం సాధించారని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి.