నల్గొండ

ఎస్సారెస్ రెండోదశ కాల్వల దశ మారేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, ఏప్రిల్ 23: తెగిపోయిన కాల్వలు...అసంపూర్తి నిర్మాణాలు...చెట్లుతో నిండిపోయి ఏ మాత్రం కనిపించని రీతిలో ఏళ్ల తరబడి మూలగడం..ఇవన్నీ శ్రీరాంసాగర్ రెండో దశ కాలువల దుస్థితికి అద్దంపడుతున్నాయి. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించబోయే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లామంత్రి జగదీష్‌రెడ్డిలకు ఈపరిణామాలన్నీ స్వాగతంగా పలకబోతున్నాయి. అంతేకాదుదు వారి పర్యటనతో తమతమ ప్రాంతాలలో శిథిలమైన కాల్వల రూపురేఖలు మారబోతున్నాయనే ఆశలను ప్రజానీకం పెట్టుకుంది. ముఖ్యంగా ఎలాంటి సాగు, తాగునీటి ప్రాజెక్టులకు నోచుకోని తుంగతుర్తి నియోజకవర్గానికి శ్రీరాంసాగర్ రెండోదశ వరంలా మారబోతుందనే ఆశలు ఇక్కడి ప్రజానీకానికి దశాబ్దాల కాలంగా ఉన్నాయి. ఈమేరకు ఆనాటి ప్రజాప్రతినిధులు ఉద్యమాలు, పోరాటాల ద్వారా దిగొచ్చిన ప్రభుత్వం నియోజకవర్గంలోని ప్రగతినగర్ వద్ద 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రెండోదశకు శంకుస్దాపన జరిగింది. అయితే భూసేకరణ, కాల్వల తవ్వకాలకు ప్రతీ ఏడాది నిధుల కేటాయింపు సక్రమంగా లేకపోవడంతో పనులు ముందుకుసాగలేదు. అనంతరం ఎన్నో అవాంతరాలు, జాప్యాల మధ్య శ్రీరాంసాగర్ రెండోదశ కాలువల తవ్వకాలు కొనసాగాయి. కొన్ని ప్రాంతాలలో భూసమస్య, తదితర వాటి వల్ల వాటి తవ్వకాలే జరగలేదు. ఈపరిస్దితుల మధ్య 2009 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నియోజకవర్గంలోని వెలిశాల వద్ద కాలువల ద్వారా నీటిని విడుదలచేసి ప్రారంభించారు. కాని కాల్వల పరిస్దితులు సక్రమంగా లేకపోవడంతో రెండోదశ నీరు అనుకున్న లక్ష్యానికి చేరలేదు. ఇవన్నీ ఇలా ఉంటే స్థానిక శాసనసభ్యులు గాదరి కిశోర్‌కుమార్ శిధిలావస్ద దశల్లో ఉన్న కాలువలపై శ్రద్ద చూపడంతో వివిధ రకాల పనుల్లో కదలికలు మొదలయ్యాయి. 69,70,71 డిబిఎం పరిధిలో ఉన్న కాలువలతో పాటు అవసరమైన చోట్ల తూముల ఏర్పాటుపై ఇటీవలే ఆశాఖ అధికారులతో ఆయన స్వయంగా పరిశీలన చేశారు. జిల్లాలో మొదలయ్యే రెండోదశ ప్రధాన కాలువకు (వెలిశాల వద్ద) ఉన్న వివిధ తరహాలో కాల్వలన్నీ శిధిలమైనట్లు ఆయన గ్రహించారు. ఈమేరకు ప్రధానమైన కాల్వల అధునీకరణకు రూ.220 కోట్లువ్యయం కానున్నట్లు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి గతంలోనే పంపారు. ప్రస్తుతం దీనికి అనుమతి లభించాల్సి ఉంది. నియోజకవర్గంలో వెంపటి-రాజనాయక్‌తండా మీదుగా వెళ్లి ప్రధాన కాల్వను కలిసే కాల్వ పరిస్దితులు దారుణంగా మారాయి. అలాగే బాపన్‌బావి తండా, గుమ్మడ వెల్లి, సీతారాంపురం, పస్తాల, కొత్తగూడెం, వెలిశాల తదితర ప్రాంతాలకు చెందిన కాల్వలన్నీ వర్షాలకు కోతకు గురవ్వడమే గాకుండా రాళ్లుతేలి శిధిలావస్ద దశలో ఉన్నాయి. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావు తన పర్యటనలో పరిస్థితులను గ్రహించి అవసరమైన నిధులు మంజూరు చేస్తారనే ఆశల్లో నియోజకవర్గ ప్రజానీకం ఉంది.
ద్విచక్ర వాహన చోదకుల్లారా..జరభద్రం

జోరుగా ధాన్యం.. కొనుగోళ్లలో ఇక్కట్లు
తిప్పర్తి, ఏప్రిల్ 23: తిప్పర్తి సబ్ మార్కెట్ యార్డుకు ధాన్యం భారీగా తరలివస్తోంది. మండల పరిధిలో ప్రస్తుత యాసంగిలో అధిక విస్తీర్ణంలో పంట సాగు చేయడం ధాన్యం రాక రెట్టింపయ్యింది. దీంతో ధాన్యం దిగుబడిని దృష్టిలో ఉంచుకొని అధికారులు సబ్ మార్కెట్ యార్డుతో పాటు మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి, కంకణాలపల్లి, తానేదార్‌పల్లి, పజ్జూరు, కొండూరు, జంగారెడ్డిగూడెం, మామిడాల, పోలేనిగూడెం, ఎల్లమ్మగూడెం, ఎర్రగడ్లగూడెం గ్రామాల్లో ఐకేపీ, పీఏసీయస్ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాగా, తిప్పర్తి సబ్ మార్కెట్ యార్డుకు సోమవారం రైతులు అధిక సంఖ్యలో తమ ధాన్యాన్ని తీసుకరావడంతో మార్కెట్‌లో స్థలం లేక ట్రాక్టర్లతో సహా మార్కెట్ బయటనే అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై ఉండిపోయారు. సుమారు 100 ట్రాక్టర్లకు పైగా రహదారిపైనే నిలిచిపోవడంతో ఇటు రైతులు ఇబ్బందులు పడటంతో పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మార్కెట్‌లో ధాన్యం పోసేందుకు స్థలం సరిపోవడం లేదని, అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు మార్కెట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో కూడా ధాన్యం కొనుగోళ్లు జరిపితే ఇబ్బందులు తలెత్తవన్నారు. అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకొని ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 40వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరగగా, ఇంకా లక్ష క్వింటాళ్ల ధాన్యం రానుందని అధికారులు పేర్కొంటున్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనాలి
* ఏఐసీసీ సభ్యుడు బూడిద..
టీడీపీ నేత బండ్రు డిమాండ్
ఆలేరు, ఏప్రిల్ 23: అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏఐసీసీ సభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణిలు డిమాండ్ చేశారు. సోమవారం ఆలేరు మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డులో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ధాన్యం తడిసి ముద్దయ్యిందని ఆరోపించారు. మండల పరిధిలో ఈదురుగాలులు, అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోతే ఇప్పటి వరకు అధికార గణం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్పుల హరినాథ్, జంపాల దశరథ, నీలం పద్మ వెంకటస్వామి, మల్లేష్, శ్రీకాంత్, అజయ్, ప్రశాంత్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.