నల్గొండ

రైతు సదస్సుకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, ఏప్రిల్ 25: జిల్లా కేంద్రంలో ఈ నెల 30న నిర్వహించే రైతు సదస్సుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు 4వేలు అందించే పెట్టుబడి పథకమైన రైతు బంధుపై సదస్సులో అవగాహన కల్పించనున్నారు. అదే విధంగా సదస్సులో రైతు సమన్వయ సమితి చైర్మన్, సభ్యులు, కో ఆర్డినేటర్లు సైతం హాజరై పలు రైతాంగ సమస్యలపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ నారాయణరెడ్డి, డీఆర్‌వో ఖీమ్యానాయక్, జేడీఏ నర్సింహారావు, ఆర్డీవో వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
పాలకులకు గుణపాఠంలా మేడే ఉత్సవాలు: జూలకంటి
మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 25: కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం ఉండేలా కార్మికుల పండగ అయిన మేడేను నిర్వహించనున్నామని సీపీఏం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఏమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక సీపీఏం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులను దివాలా తీయించి సామాన్య, మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బులు లేకుండా చేశారన్నారు. కార్పోరేట్ శక్తులు, నల్లకుబేరులు బ్యాంకు నుండి డబ్బు తీసుకుని దాచుకోవడం వల్ల, విదేశాలకు తరలి వెళ్లడం వల్లనే నేడు కార్మికులు కూడ డబ్బుకు ఇబ్బందులు పడ్తున్నారన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం మతోన్మాదం పెంచడంలో, దళితులు, ముస్లిం, క్రైస్తవ మైనార్టిలపై దాడులు చేయడం, మహిళలు, బాలికలపై అత్యాచారాలే దేశంలో అభివృద్ధి చెందుతున్నదని ఆరోపించారు. పాలకులకు బుద్ధి వచ్చేలా మేడే నిర్వహించాలన్నారు. సమావేశంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు డీ.మల్లేష్, సహాయ కార్యదర్శి మహ్మద్‌బిన్‌సయిద్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ గౌతంరెడ్డి, టీ.రామ్మూర్తి, ఏం.రవినాయక్, నాగునాయక్, శంకర్, సైదానాయక్‌లు పాల్గొన్నారు.