నల్గొండ

టెలికాం సేవల్లో జిల్లా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, ఏప్రిల్ 26: టెలికాం సేవలు అందించడంలో రాష్ట్రంలోనే నల్లగొండ ఉమ్మడి జిల్లా ముందంజలో ఉందని టెలికాం అడ్వయిజరీ కమిటీ చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తమ టెలికాం సేవల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో 8 అవార్డులకు గాను నల్లగొండ జిల్లాకు నాలుగు అవార్డులు దక్కడం అభినందించదగ్గ విషయమన్నారు. ల్యాండ్ లైన్, ఇంటర్నెట్, అసీమ్, మొబైల్ కనెక్షన్ల విభాగాల్లో అవార్డులు వచ్చినట్లు తెలిపారు. 2018-19సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లాలో 54 4జీ, 30 3జీ టవర్లు మంజూరైనట్లు వివరించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన 1,199 టారీఫ్ ఫ్యామిలీ ప్లాన్‌పై సమావేశంలో చర్చించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించి.. అవార్డులు దక్కేందుకు కృషి చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్, జీఎం కె. వీరనాగేశ్వర్‌రావు, సభ్యులు కృష్ణమూర్తి, జి.వెంకట్‌రెడ్డి, పి.యాదయ్యగౌడ్, జి.రాములు పాల్గొన్నారు.